నిద్ర ఎలా పోతున్నారు?
close
Published : 08/12/2021 00:40 IST

నిద్ర ఎలా పోతున్నారు?

అతి ఎప్పుడూ సమస్యే! ఇది నిద్రకీ వర్తిస్తుందంటున్నారు పరిశోధకులు. నిద్ర మరీ ఎక్కువైనా, తక్కువైనా మెదడు నరాలపై ఆ ప్రభావం పడుతుందంటున్నారు.

కంటి నిండా నిద్ర ఆరోగ్యానికెంతో ముఖ్యం. శరీరం తనకు కావాల్సిన మరమ్మతులు చేసుకునేది ఈ సమయంలోనే. మానసిక ఆరోగ్యమూ దీనితోనే ముడిపడి ఉంటుంది. మంచి నిద్ర హృద్రోగం, మధుమేహం వంటి అనారోగ్యాలను దరిచేరనివ్వదు. అయితే ఇది పరిమితంగా ఉంటేనే ఈ ప్రయోజనాలను అందిస్తుందట. సగటున మనిషికి ఎంత నిద్ర అవసరమో పరిశీలించడానికి వాషింగ్టన్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. 70 ఏళ్ల వారిని 100 మందిని నాలుగైదు ఏళ్లపాటు ట్రాక్‌ చేయగా, వీరిలో 88 మందిలో ఎలాంటి సమస్యలూ లేవు. మిగతా 12 మందిలో నరాల సంబంధిత సమస్య బయటపడింది. వారి ఆహార అలవాట్లు, నిద్రపోయే సమయాన్ని పరిశీలించగా, 88 మందికి ఆరు గంటలపాటు గాఢ నిద్రలోకి జారే అలవాటున్నట్లు గుర్తించారు. మిగతా వారిలో ఇది అతి తక్కువ లేదా ఎక్కువగా ఉంది. నాలుగున్నర గంటలకన్నా తక్కువ లేదా ఆరున్నర గంటలకన్నా ఎక్కువగా నిద్రపోయేవారిలో పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు.

నిద్ర సమయంలో మెదడు బీటా అమిలోయిడ్‌ వంటి హార్మ్‌ఫుల్‌ ప్రొటీన్లను బయటకు పంపేస్తుంది. దీంతో ఉదయం నిద్రలేవగానే ఉత్సాహంగా ఉంటుంది. అతిగా నిద్రపోయేటప్పుడు ఈ విధానంలో మార్పులు చోటు చేసుకుని అది దుష్ప్రభావంగా మారుతోందట. అలాగే 60 ఏళ్లు దాటిన వారికి సాధారణంగా ఏడెనిమిది గంటల నిద్ర అవసరం. అయితే ఇది తగ్గినా, గాఢనిద్రకి భంగం కలుగుతూ తిరిగి నిద్రలోకి జారే విధానం వల్లా ప్రయోజనం తక్కువేనట. అలాగే అతి నిద్ర కూడా మెదడులో నరాలకు సంబంధించిన సమస్యలకు కారణమవుతుంది. అందుకే ఎటువంటి భంగం కలగకుండా కంటినిండా ఆరున్నర గంటలపాటు నిద్రపోమని సలహానిస్తున్నారు. అదే ఆరోగ్యకరం అంటున్నారు.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని