ఈ కాలం.. హాయిగా సాగనీ..
close
Published : 09/12/2021 01:11 IST

ఈ కాలం.. హాయిగా సాగనీ..

చలికాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అనారోగ్యాల భయం. ఇంటిల్లిపాదినీ కనిపెట్టుకొని ఉండే ఇల్లాలికి ఇదో సమస్య. ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి.. ఉపశమనం దొరుకుతుంది.

చల్లగాలులకు జలుబూ దగ్గూ, గొంతు నొప్పీ సర్వసాధారణం. కరోనా ఇంకా వదిలిపోనందున చిన్నగా తుమ్మినా అనుమాన చూపులొకటి! కనుక వీలైనంతవరకూ జలుబు రాకుండానే చూసుకోవాలి.. క్రమం తప్పకుండా అరగంటసేపు ప్రాణాయామం చేయండి. ఊపిరితిత్తులు బలపడతాయి. చిటికెడు ఆమ్లా పొడి తేనెలో రంగరించి ఇంట్లో వాళ్లందరికీ తినిపించండి. శ్వాసకోశ ఇబ్బందులు శాశ్వతంగా పరిష్కారమవుతాయి.

సంపూర్ణ పోషకాహారం తీసుకుని రోగనిరోధక శక్తి పెంచుకుంటే ఫ్లూ జ్వరాలనూ తరిమికొట్టొచ్చు. ఎండాకాలంలా ఈ సీజన్‌లో శక్తి ఎక్కువ ఖర్చు కానందున బరువు పెరిగే అవకాశాలెక్కువ. కాబట్టి, చలికి బద్ధకించి వ్యాయామాన్ని అశ్రద్ధ చేయొద్దు. కనీసం నాలుగు అడుగులైనా వేయండి. కీళ్లనొప్పులకీ వ్యాయామం మంచి పరిష్కారం.

ఈ కాలంలో చర్మం పొడిబారుతుంది. మాయిశ్చరైజర్‌ లేదా పెట్రోలియం జెల్లీ తప్పక వాడాలి. పగిలిన పెదాలకు రాత్రుళ్లు వెన్న లేదా నెయ్యి రాస్తే సరి. పాదాలు పగులుతుంటే రాత్రిపూట కొబ్బరినూనె రాసి కొంచెం మర్దనా చేయండి. రోజూ ఐదారు బాదంపప్పులు నానబెట్టి పొట్టు తీసి తిన్నా ఈ సమస్యను అరికట్టవచ్చు.

చలికి కిటికీలు మూసి ఉంచడాన గదులన్నీ ఒకరకమైన వాసనతో నిండిపోతాయి. ఆ ప్రభావం మూడ్‌పైనా పడుతుంది. రోజులో రెండు మూడు గంటలన్నా తలుపులు, కిటికీలూ తెరిచిపెట్టండి. ఈ చిన్ని చిట్కాలను పాటిస్తే ఈ కాలాన్ని హాయిగా గడిపేయొచ్చు.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని