తినే తీరూ గమనించుకోండి!

పని హడావుడిలో తిండిని పక్కన పెట్టేస్తాం. వేళలెలాగూ పట్టించుకోవట్లేదు.. తినే తీరైనా పాటిస్తున్నారా?అందరి తర్వాతే మనం అన్న ధోరణి మనలో చాలామందిలో ఉంటుంది. అందుకే ఆఖర్న తినడానికి మొగ్గు చూపుతాం. దీనికి తోడు కష్టపడి చేసింది వృథా అవుతుందని పిల్లలు వదిలేసినా.. కొద్దిగా మిగిలినా పొట్టలోకి చేర్చేస్తుంటాం. ఇది మంచి ధోరణి కాదు. తెలియకుండానే ఎక్కువ మోతాదులో తీసుకునే ఆహారం అనారోగ్యానికి దారి తీస్తుంది. మిగిలిందని వేయడానికి పొట్టేమీ చెత్త బుట్ట కాదు కదా!

Updated : 10 Dec 2021 05:30 IST

పని హడావుడిలో తిండిని పక్కన పెట్టేస్తాం. వేళలెలాగూ పట్టించుకోవట్లేదు.. తినే తీరైనా పాటిస్తున్నారా?

అందరి తర్వాతే మనం అన్న ధోరణి మనలో చాలామందిలో ఉంటుంది. అందుకే ఆఖర్న తినడానికి మొగ్గు చూపుతాం. దీనికి తోడు కష్టపడి చేసింది వృథా అవుతుందని పిల్లలు వదిలేసినా.. కొద్దిగా మిగిలినా పొట్టలోకి చేర్చేస్తుంటాం. ఇది మంచి ధోరణి కాదు. తెలియకుండానే ఎక్కువ మోతాదులో తీసుకునే ఆహారం అనారోగ్యానికి దారి తీస్తుంది. మిగిలిందని వేయడానికి పొట్టేమీ చెత్త బుట్ట కాదు కదా!

తాజా ఆహారాన్ని వేడిగా తీసుకునేలా చూసుకోండి. ఫ్రిజ్‌లో పెట్టిన, నిల్వ ఆహారానికి దూరంగా ఉండండి. ఇవి దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

ఉదయం లేచినప్పటినుంచీ హడావుడే.. నిజమే కానీ మీ ఆరోగ్యాన్నీ చూసుకోవాలిగా! వేళ దాటిన ఆహారం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ప్రత్యేకంగా అల్పాహారం తీసుకునే అవకాశం లేకపోతే.. ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. నట్స్‌, పండ్లు, గుడ్డు, పాలు.. ఇలా ఏవైనా కావొచ్చు. తీసుకోండి. అప్పుడు వేళల్ని పాటించినవారవుతారు. తర్వాత కొద్దిమొత్తంలో టిఫిన్‌, భోజనం చేస్తే సరిపోతుంది. పోషకాలూ అందుతాయి, ఆరోగ్యమూనూ!

అలాగే వేగంగానూ తినకండి. ఆహారం ఒంటికి పట్టాలంటే ప్రశాంతంగానే తినాలి. పని ఆలోచనను మనసులో పెట్టుకొని గబగబా లాగించేయొద్దు. జీర్ణాశయంపై ఒత్తిడి పడుతుంది. నెమ్మదిగా, నములుతూ తినండి. మరికొందరు అన్ని పనులూ పూర్తయ్యాక తీరిగ్గా తిండివైపు వెళతారు. రిలాక్సేషన్‌ పేరుతో టీవీ చూస్తూనో, ఫోన్‌ మాట్లాడుతూనో తింటుంటారు. ఇదీ మంచి పద్ధతి కాదనేది నిపుణుల మాట. అలాగే భోజనం మధ్యలో ఎక్కువగా నీళ్లూ తీసుకోవద్దు. తప్పనిసరైతే కొద్ది మొత్తంలో తాగితే సరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్