నిద్రలేమికి ఆసనం
శరీరంలో ఏ భాగానికీ ఒత్తిడి, అలసట కలిగించకుండా సేద తీరుతున్నట్టుగా పడుకోవడమే యోగనిద్ర. దీనిలో శ్వాసమీద దృష్టిపెట్టి మనసుతో శరీర భాగాలను గమనించాలి. ఎక్కడైనా నొప్పిగా అనిపిస్తే శ్వాస దాని దగ్గరకు వెళ్తున్నట్లు
శరీరంలో ఏ భాగానికీ ఒత్తిడి, అలసట కలిగించకుండా సేద తీరుతున్నట్టుగా పడుకోవడమే యోగనిద్ర. దీనిలో శ్వాసమీద దృష్టిపెట్టి మనసుతో శరీర భాగాలను గమనించాలి. ఎక్కడైనా నొప్పిగా అనిపిస్తే శ్వాస దాని దగ్గరకు వెళ్తున్నట్లు ఊహించి, మెల్లగా వదలండి. ఆపై కీళ్లు, చీలమండ, కండరాలు, చర్మం, మోకాళ్లను గమనించండి. మోకాలిచిప్పల్లో ద్రవం ఉందా లేక ఎండిపోయినట్లుందో మీకు కనిపించాలి. తొడల లోపల, బయట గమనించి పొత్తికడుపు, పెద్దపేగు, మూత్రనాళాలు, మూత్రకోశం, పొట్ట పైభాగం, ఉదరభాగం, ఊపిరితిత్తులు అన్నిటినీ చూడండి. బాగా శ్వాస తీసుకుని, అది గుండె, తక్కిన భాగాలకి అందుతున్నట్లు భావించి ఊపిరితిత్తుల్ని క్లియర్ చేసుకోండి. లోపలున్న కాలుష్యాలన్నీ వెళ్లిపోవాలి. తర్వాత గుండె, రక్తప్రసరణ, థైరాయిడ్ గ్రంథి, స్వరతంత్రులు, గొంతు, రెండు చేతులనూ గమనించండి. ఇవన్నీ శరీరం కదలకుండా మనసుతో చేయాలి. తొడ నుంచి పిరుదులు, వెన్నుపూస, కండరాలు, వీపు, మెడ, తల వెనుక భాగం వరకూ గమనించండి. మెడ కండరాలను రిలాక్స్ చేయండి. హాయిగా శ్వాస తీసుకుని వదలండి. తల పైభాగమంతా పరిశీలించి సేదతీరి కళ్లు, ముక్కు, చెంపలు, పెదాలు, నోరు, చెవులను గమనించి, నుదుటి మధ్య ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టిపెట్టండి. ‘శరీరంలో అన్ని భాగాలకూ శక్తినిచ్చాను ప్రతిదీ హాయిగా ఉంది’ అనుకుంటూ శ్వాస వదలండి. ఏ ఆలోచనలూ వద్దు. ఒకవేళ వచ్చినా తిరిగి శ్వాసమీద దృష్టిపెట్టండి. ఈ యోగనిద్రతో నిద్రలేమి సమస్య ఉండదు. ఒత్తిడి, ఆందోళన తగ్గి, రోగనిరోధకశక్తి మెరుగవుతుంది. అన్ని వయసులవారూ దీన్ని చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
అనుబంధం
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?