బద్ధకంగా ఉంటే.. ఆహారం మార్చండి!

కొవిడ్‌ మన జీవితాల్లో చాలా మార్పులు తెచ్చింది. వ్యాయామం, నడక అన్నీ వదిలేశాం. దీనికితోడు ఇంటి నుంచే పని. వెరసి.. అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. దొరికిన కాస్త సమయం విశ్రాంతికే సరిపోతోంది. ఇవన్నీ ఆరోగ్యాన్నీ, మనసునీ స్తబ్దుగా మార్చేస్తున్నాయి. గతంలోలా ఫిట్‌గా, ఉత్సాహంగా ఉండాలంటే..

Updated : 12 Dec 2021 04:38 IST

కొవిడ్‌ మన జీవితాల్లో చాలా మార్పులు తెచ్చింది. వ్యాయామం, నడక అన్నీ వదిలేశాం. దీనికితోడు ఇంటి నుంచే పని. వెరసి.. అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. దొరికిన కాస్త సమయం విశ్రాంతికే సరిపోతోంది. ఇవన్నీ ఆరోగ్యాన్నీ, మనసునీ స్తబ్దుగా మార్చేస్తున్నాయి. గతంలోలా ఫిట్‌గా, ఉత్సాహంగా ఉండాలంటే.. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు.

* చక్కెర... మధ్యాహ్న భోజనం తర్వాత చాలామందికి తీపి తినే అలవాటు ఉంటుంది. ఫలితం రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌కూ కారణమవుతాయి. అంతేకాదు అవయవాలవాపు, శరీరంలో అదనపు నీరు చేరడం, కీళ్ల నొప్పులు, అధికబరువు సమస్యలు మొదలవుతాయి. వీటితోపాటు పలురకాల అనారోగ్యాలూ దరిచేరుతాయి. రోజుమొత్తంలో అతి తక్కువ మోతాదులోనే చక్కెరను తీసుకోవాలి.  

* ఏం తింటున్నారు.. రాత్రి,  ఉదయపు ఆహారానికి మధ్య దాదాపు 10 గంటల తేడా ఉంటుంది. కాబట్టి, అల్పాహారాన్ని తప్పక తీసుకోవాలి. అప్పుడే శరీరం తిరిగి శక్తిని తెచ్చుకోగలదు. దానిలో పీచు ఎక్కువగా ఉన్న ఆహారం ఉండేలా చూసుకుంటే శరీరానికి తగినంత శక్తి అంది రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. మధ్యాహ్న భోజనంలో పోషకాలు, ఖనిజ లవణాలు మెండుగా ఉండే కూరగాయలకు 50 శాతం చోటివ్వాలి. సాయంకాలాల్లో స్నాక్స్‌ తినే అలవాటు ఉంటే బదులుగా తాజా పండ్లు తీసుకోవాలి. నూనె, మైదాతో చేసే స్నాక్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

* మంచినీరూ.. రోజుకి కనీసం 3-4 లీటర్ల నీటిని శరీరానికి అందించాలి. రెండు మూడుసార్లు తాజా పండ్ల రసంతోపాటు నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. దీంతో వ్యర్థాలు బయటికి వెళ్లిపోయి, అనారోగ్యాలు దరిచేరవు. రాత్రి త్వరగా పడుకోవడం, ఉదయాన్నే నిద్రలేవడం చేయాలి. నడక, యోగా వంటివి శరీరాన్ని, మెదడును రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. ఈత, మనసుకు నచ్చిన క్రీడలో శిక్షణతోపాటు లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకుంటే చాలు. బద్ధకం ఆమడ దూరంలో ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్