ఇవి తింటే తంటానే

ఇల్లాలిగా కుటుంబానికి ఆరోగ్యకరమైనవి వండి వడ్డించండి... హాని చేసేవి వద్దని వారించండి. ఏయే ఆహార పదార్థాలు ప్రమాదకరమో, ఏవి తింటే ఏమవుతుందో చార్టులుగా రాసి డైనింగ్‌ హాల్లో ....

Published : 13 Dec 2021 01:07 IST

ఇల్లాలిగా కుటుంబానికి ఆరోగ్యకరమైనవి వండి వడ్డించండి... హాని చేసేవి వద్దని వారించండి. ఏయే ఆహార పదార్థాలు ప్రమాదకరమో, ఏవి తింటే ఏమవుతుందో చార్టులుగా రాసి డైనింగ్‌ హాల్లో కనిపించేలా తగిలించేయండి...

చిప్స్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌:  వీటిని చిన్నా పెద్దా ఇష్టంగా ఆరగించేస్తారు. కొద్ది మోతాదులో ఎప్పుడైనా తింటే ఫరవాలేదు. లేదంటే చాలా ప్రమాదం. వీటికి బదులుగా ఉడికించిన ఆలుగడ్డను కాస్త వేయించి తినొచ్చు.

బ్రెడ్‌: మైదాతో తయారయ్యే ఈ తేలికైన బ్రేక్‌ఫాస్ట్‌ క్లిష్టమైన సమస్యలకు దారితీస్తుంది. వైట్‌ బ్రెడ్‌ మధుమేహంతో సహా అనేక రోగాలకు కారణమవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మొలకలతో తయారయ్యే ఎజెకిల్‌ రొట్టె లేదా గోధుమలతో తయారయ్యే బ్రౌన్‌ బ్రెడ్‌ తినొచ్చు.

పిజ్జాలు: మళ్లీ మళ్లీ శుద్ధిచేసిన పిండి, ప్రాసెస్‌ చేసిన ఆహారంతో తయారయ్యే పిజ్జాలు మంచివి కావు. కెలొరీలూ అధికమే.

వేపుళ్లు: ఇవి ఎక్కువగా తినేవారిలో సాధారణ జబ్బులతోబాటు క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులూ వస్తున్నట్టుగా పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

గ్రిల్డ్‌, బ్రాయిల్డ్‌: అధిక సెగ మీద కాల్చినవి, వేయించినవి తినడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముంది. ప్రత్యామ్నాయంగా తక్కువ సెగలో ఉడికించి తినాలి.

రెడీమేడ్‌ ఫ్రూట్‌ జ్యూస్‌లు: వీటిల్లో ఉపయోగించే ప్రిజర్వేటివ్‌లు, అధిక తీపిదనం అనారోగ్యానికి దారితీస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్