ఈ కాలానికి సరిజోడి!

సాయంత్రం పూట స్నాక్‌గా పల్లీలకు మించినవి ఏముంటాయి? ఇది చిరుతిండి మాత్రమే కాదు... శీతకాలంలో మంచి పోషకాహారం కూడా అంటున్నారు నిపుణులు..

Updated : 14 Dec 2021 05:29 IST

సాయంత్రం పూట స్నాక్‌గా పల్లీలకు మించినవి ఏముంటాయి? ఇది చిరుతిండి మాత్రమే కాదు... శీతకాలంలో మంచి పోషకాహారం కూడా అంటున్నారు నిపుణులు..

బాదం, వాల్‌నట్స్‌, జీడిపప్పు వంటి వాటితో పోలిస్తే వేరుసెనగపప్పుని చిన్నచూపు చూస్తాం కానీ పోషకాలపరంగా ఇవి వాటికి తీసిపోవు. ముఖ్యంగా శరీరానికి అవసరమైన మైక్రో నూట్రియంట్లని పుష్కలంగా అందిస్తాయి.

* కార్బోహైడ్రైట్లు తక్కువ, కొవ్వు, ప్రొటీన్లు అధికంగా ఉండే  పల్లీలు బరువు తగ్గడానికి సహకరిస్తాయి. అలాగని అతి పనికిరాదు... మితంగా తినాలంటున్నారు పోషకాహార నిపుణులు.

* ఈ కాలంలో బెల్లంతో చేసిన పల్లీ పట్టీలు తినడం వల్ల శరీరం వెచ్చ బడుతుంది. జీవక్రియలు చురుగ్గా సాగుతాయి.

* జుట్టుకు, చర్మానికీ మేలు చేసే బయోటిన్‌, విటమిన్‌ ఇ వంటివి పల్లీల్లో అధికం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్