సెరామిక్‌తో ఆరోగ్యం ఆదా!

మట్టి కుండల నుంచి స్టీలు పాత్రల దాకా సాగింది మన వంటింటి ప్రయాణం. ఇప్పుడిక ఆ జాబితాలోకి సెరామిక్‌ కూడా చేరింది. దీనితోనూ బోలెడు ప్రయోజనాలున్నాయి. అవేంటో చదివేయండి. సెరామిక్‌ పాత్రలు బరువు తక్కువ. చూడటానికి అందంగా ఉండటంతోపాటు వండేందుకూ అనుకూలం. ఎన్నాళ్లు వాడినా కొత్తగానే కనిపిస్తాయి. శుభ్రపరచడం కూడా చాలా సులువు...

Updated : 16 Dec 2021 04:59 IST

మట్టి కుండల నుంచి స్టీలు పాత్రల దాకా సాగింది మన వంటింటి ప్రయాణం. ఇప్పుడిక ఆ జాబితాలోకి సెరామిక్‌ కూడా చేరింది. దీనితోనూ బోలెడు ప్రయోజనాలున్నాయి. అవేంటో చదివేయండి.

సెరామిక్‌ పాత్రలు బరువు తక్కువ. చూడటానికి అందంగా ఉండటంతోపాటు వండేందుకూ అనుకూలం. ఎన్నాళ్లు వాడినా కొత్తగానే కనిపిస్తాయి. శుభ్రపరచడం కూడా చాలా సులువు.

ఇప్పుడు పాత్రల నుంచీ ఎక్కడ రసాయనాలు విడుదలవుతాయోననే భయం. కానీ.. వీటిల్లో లెడ్‌, కాడ్మియం తదితర టాక్సిక్‌ రసాయనాల కోటింగులు ఉండవు. సహజమైన దళసరి లోహంతో తయారవుతాయి కనుక పదార్థాలు హానికరంగా మారవు. చింతపండు, నిమ్మ మొదలైన పుల్లటి పదార్థాలతో వంట చేసినా రుచి, పరిమళాల్లో మార్పు రాదు. కాబట్టి ఇవెంతో ఆరోగ్యదాయకం.

సిలికాన్‌తో రూపొందిన సెరామిక్‌ జెల్‌ నాన్‌స్టిక్‌గా పనిచేస్తుంది. తక్కువ సెగలో పదార్థాలు త్వరగా ఉడుకుతాయి. ఇంధన ఆదాతోపాటు పోషకాలూ ఆవిరి కావు. టెఫ్లాన్‌ నాన్‌స్టిక్‌ కంటెయినర్లతో పోలిస్తే ఈ పాత్రల్లో వంట త్వరగా పూర్తవుతుంది. కొన్నిరకాల పాత్రలు అత్యధిక సెగ మీద పేలిపోయే ప్రమాదముంది. కానీ ఇవి అత్యధిక ఉష్ణోగ్రతలోనూ సురక్షితంగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్