మనసును సేదతీర్చే పచ్చిక

ఆకుపచ్చటి లాన్‌తో ఇంటికి ఎంతో అందం వస్తుంది. అందుకే కొందరు సింథటిక్‌ గ్రాస్‌ కార్పెట్లు పరుస్తోంటే ఇంకొందరు నర్సరీలో గడ్డి పట్టీలు కొని తెస్తున్నారు. మరికొందరు సొంతంగా లాన్‌ పెంచుతున్నారు. ఆదాయ మార్గంగానూ మార్చుకుంటున్నారు. మరి లాన్‌ పెంపకంలో కిటుకులేంటో చూడండి.

Published : 18 Dec 2021 00:49 IST

ఆకుపచ్చటి లాన్‌తో ఇంటికి ఎంతో అందం వస్తుంది. అందుకే కొందరు సింథటిక్‌ గ్రాస్‌ కార్పెట్లు పరుస్తోంటే ఇంకొందరు నర్సరీలో గడ్డి పట్టీలు కొని తెస్తున్నారు. మరికొందరు సొంతంగా లాన్‌ పెంచుతున్నారు. ఆదాయ మార్గంగానూ మార్చుకుంటున్నారు. మరి లాన్‌ పెంపకంలో కిటుకులేంటో చూడండి.

* తేమను భరించే గచ్చు మీద తడి మట్టి పోసి సమంగా సర్ది బెడ్‌ తయారు చేసి గడ్డినారు నాటాలి. విత్తనాలు అన్నిసార్లూ మేలైనవి కాకపోవచ్చు. గడ్డిమొక్కలు స్థిరపడే వరకూ స్ప్రింక్లర్‌తో మాత్రమే నీళ్లు చిలకరించాలి. లేదంటే మట్టిలోంచి బయటికొచ్చేస్తాయి. అప్పుడప్పుడు ఆవుపేడను నీళ్లలో కలిపి జల్లితే గడ్డికి తెగులు పట్టదు, ఏపుగా పెరుగుతుంది. మూడు నెలలకోసారి లాన్‌ను ట్రిమ్‌ చేయాలి. చదరపు అంగుళం స్థలంలో ఆరు మొక్కలు పెరుగుతాయి.
* లవణాలున్న నేల లాన్‌కు అనుకూలం. ఇంటి ముంగిట  కొద్ది స్థలమే ఉంటే కొంత మేర గుండ్రంగా లాన్‌ ఏర్పాటు చేసి కుర్చీలు అమర్చుకుంటే సరి. పూలమొక్కలు, పండ్లచెట్లు ఉన్న దగ్గర లాన్‌ వంపు తిరిగి చూడటానికి చాలా బాగుంటుంది. మధ్యలో బర్డ్‌బాత్‌ అమరిస్తే ఆ అందమే వేరు. టెర్రస్‌ మీద, బాల్కనీలో ఉన్న కొద్ది స్థలంలో కూడా లాన్‌ ఏర్పాటు చేయొచ్చు. ఆ పచ్చిక మీద కాసేపు విశ్రాంతి తీసుకుంటే మనసూ, మెదడూ కూడా సేదతీరతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్