ఉపవాసం మొదలుపెట్టారా...

ఎవరో చెప్పినవో, చదివినవో ఆరోగ్య సూత్రాలను పాటించడం, ఫిట్‌నెస్‌ కోసం ప్రయత్నించడం చాలా మంది చేసేదే. అలాగని ఎవరికి నచ్చినట్లుగా వారు డైటింగ్‌, ఫాస్టింగ్‌ చేయడం మంచిది

Published : 20 Dec 2021 01:20 IST

ఎవరో చెప్పినవో, చదివినవో ఆరోగ్య సూత్రాలను పాటించడం, ఫిట్‌నెస్‌ కోసం ప్రయత్నించడం చాలా మంది చేసేదే. అలాగని ఎవరికి నచ్చినట్లుగా వారు డైటింగ్‌, ఫాస్టింగ్‌ చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. దానికీ కొన్ని నియమాలను పాటించాలంటున్నారు. అవేంటంటే...

* అడపాదడపా...

చాలామంది తమ స్నేహితులు, బంధువులు, జిమ్‌మేట్స్‌ లేదా సహోద్యోగులతో కలిసి చేసేదే అడపాదడపా డైటింగ్‌. బరువు తగ్గడానికి చేసే ఈ ఫాస్టింగ్‌ను పూర్తిగా డైటింగ్‌ అని పిలవ కూడదు. అయితే బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తారు. వీరు ఉదయం, మధ్యాహ్నభోజనం మధ్య ఇచ్చే గడువు ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎక్కువ గంటలు ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం తక్కువ. అయినా అధిక బరువు పెరిగే ప్రమాదం మాత్రం ఉండదు. అలాగే మధుమేహం, హృద్రోగాలకు దూరంగా ఉండొచ్చు. జీవక్రియల సమన్వయం బాగుంటుంది.

* 6 - 8 గంటల్లోపు...

ఉదయం, మధ్యాహ్నం భోజనానికి మధ్య ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం ఉండేలా చేసి, ఆ తర్వాత 16 నుంచి 18 గంటల వరకు ఏమీ తీసుకోకపోవడం మరో పద్ధతి. ఈ విధానంలో అధికబరువుకు దూరం కావడమే కాకుండా అనారోగ్యాలూ దరిచేరవు. వారానికి అయిదురోజులపాటు 500 - 600 కెలొరీలు అందేలా ఆహారాన్ని తీసుకుంటూ, మిగతా రెండు రోజులు ఒక మీల్‌ మాత్రమే తీసుకోగలిగితే కూడా ఫాస్టింగ్‌ ఫలితం కనిపిస్తుంది. అయితే 18 ఏళ్లలోపు వారు, గర్భిణులు మాత్రం నిపుణుల సూచనలు పాటిస్తే మంచిది.

* ఆహారమిలా...

డైటింగ్‌, ఫాస్టింగ్‌ చేస్తున్నాం కదా అనుకుంటూ నూనె వస్తువులు, ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారం, అత్యధిక కెలొరీలుండే జంక్‌ ఫుడ్‌ వంటి జోలికి వెళితే ఫలితం ఉండదు. పాలిష్‌ చేయని ధాన్యాలు, ఆకు కూరలు, ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రొటీన్లు, ఎక్కువగా పీచు ఉండే కూరగాయలు, పండ్లు వంటివి ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి. దీంతోపాటు రోజూ చేసే వ్యాయామాలు శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్