రెండాకులతో రక్షణ!

మనందరికీ అందంగా కనిపించాలని ఉంటుంది. అందుకోసం ఉపయోగించే క్రీములూ లోషన్లలో ఉండే రసాయనాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో హాని చేస్తాయి. అందుకు ప్రత్యామ్నాయంగా ఈ చిట్కా పాటించి చూడండి.

Updated : 21 Dec 2021 05:53 IST

మనందరికీ అందంగా కనిపించాలని ఉంటుంది. అందుకోసం ఉపయోగించే క్రీములూ లోషన్లలో ఉండే రసాయనాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో హాని చేస్తాయి. అందుకు ప్రత్యామ్నాయంగా ఈ చిట్కా పాటించి చూడండి.

రోజూ ఉదయాన్నే రెండు వేపాకులను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవడమే కాదు... మంట, నొప్పి, దురద, దద్దుర్లు, పేలడం లాంటి చర్మ సమస్యలను అరికట్టవచ్చు.  మొటిమలు తగ్గుతాయి. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుతాయి. వేపాకు తినలేం అనుకుంటే ఆకులను నీళ్లలో మరిగించి, వడకట్టి తాగినా ప్రయోజనం ఉంటుంది.

* వేపాకు మరిగించిన నీటితో రోజుకోసారి ముఖం కడుక్కుంటే కళ్లు తేటగా ఉంటాయి. చూపు మందగించదు. కళ్ల మంటలు, దురదలు, అలసట, ఎర్రబారడం తగ్గుతాయి. ముఖంలో నిగారింపు వస్తుంది.

* వేపాకు నూరి తలకు పట్టిస్తే జుట్టు రాలడం, చిట్లడం, డ్రైగా అవడం, చుండ్రు లాంటి సమస్యలు తగ్గి, కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

* అనారోగ్యాలనూ నివారిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి, చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తుంది. కడుపులో నులిపురుగును చేరనివ్వదు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ ప్రక్రియను పెంపొందిస్తుంది.  గొంతు నొప్పి తగ్గిస్తుంది. దంతాలను సంరక్షిస్తుంది. సాధారణ ఫ్లూ జ్వరాల నుంచి క్యాన్సర్‌ వంటి మహమ్మారి రోగాల వరకూ రక్షణగా నిలుస్తుంది. బాగుంది కదూ... రెండు వేపాకులతో అందాన్నీ  ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్