ఈ దువ్వెనతో పేలు పరార్!
బడికి వెళ్లే పిల్లలను ఆదివారం, సెలవు రోజుల్లో ముందు కూర్చో బెట్టుకుని పేలు చూడటం, పేల దువ్వెనతో దూయటం చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపించే దృశ్యమే. సాధారణంగా కొంతమంది చిన్నారులు, మహిళలు తల్లో పేలతో...
బడికి వెళ్లే పిల్లలను ఆదివారం, సెలవు రోజుల్లో ముందు కూర్చోబెట్టుకుని పేలు చూడటం, పేల దువ్వెనతో దూయటం చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపించే దృశ్యమే. సాధారణంగా కొంతమంది చిన్నారులు, మహిళలు తల్లో పేలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇవి ఒక పట్టాన వదలవు. పేల దువ్వెనతో దువ్వినప్పుడు కాస్త తగ్గుతాయి కానీ, వాటి గుడ్లు మళ్లీ కొన్ని రోజులకే పేలుగా మారతాయి. వీటిని పూర్తిగా నిర్మూలించడానికి మార్కెట్లో షాంపూలు లభ్యమవుతున్నా వాటి వల్ల దుష్ప్రభావాలూ ఉంటాయి. వీటన్నింటనీ పూర్తిగా తొలగిస్తుందీ పరికరం. వి-కోంబ్‌గా పిలుస్తారు. సాంకేతికంగా అభివృద్ధి చేసిన ఈ కొత్తరకం పేన్ల దువ్వెన పేలు, వాటి గుడ్లు... అన్నింటిని తీసేస్తుంది.
దీన్ని పిల్లలు, మహిళలు... అందరూ సులువుగా వాడుకోవచ్చు. రీయూజబుల్ కూడా. దువ్వెనలా ఉండే దీనికి స్టెయిన్లెస్ స్టీల్ పళ్లుంటాయి. వీటి సాయంతో పేలు, వాటి గుడ్లను పూర్తిగా తీసేయొచ్చు. చూడటానికి ట్రిమ్మర్‌లా ఉంటుంది. ఈ దువ్వెన దూసిన పేలన్నీ ఫిల్టర్‌లోకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత వీటిని తీసేసి కిట్‌ను శుభ్రం చేసి పెట్టుకుంటే సరి. కాస్త ధర ఎక్కువనిపించినా పేల ఇబ్బందితో పోల్చుకుంటే అధికంగా అనిపించదు. మీరూ ఈ ఇబ్బందితో బాధపడుతుంటే ఓసారి చూసేయండి మరి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!