నిద్రకీ.. రోజ్‌వాటర్‌

సౌందర్య పోషణకు ఉపయోగించే ప్రధానమైన వాటిల్లో రోజ్‌వాటర్‌ ఒకటి. దీనివల్ల చర్మం నిగారించడమే కాదు.. ఇంకా బోలెడు ప్రయోజనాలున్నాయి. ఒక కప్పు నీటికి పావు కప్పు రోజ్‌ వాటర్‌ కలపండి. తలస్నానం పూర్తయ్యాక ఆఖర్లో ఈ మిశ్రమంతో జుట్టును కడిగేస్తే పట్టుకుచ్చులా మెరుస్తుంది. కేవలం రోజ్‌వాటర్‌కి కొన్ని చుక్కల జాస్మిన్‌/ లావెండర్‌...

Updated : 22 Dec 2021 05:00 IST

సౌందర్య పోషణకు ఉపయోగించే ప్రధానమైన వాటిల్లో రోజ్‌వాటర్‌ ఒకటి. దీనివల్ల చర్మం నిగారించడమే కాదు.. ఇంకా బోలెడు ప్రయోజనాలున్నాయి.

క కప్పు నీటికి పావు కప్పు రోజ్‌ వాటర్‌ కలపండి. తలస్నానం పూర్తయ్యాక ఆఖర్లో ఈ మిశ్రమంతో జుట్టును కడిగేస్తే పట్టుకుచ్చులా మెరుస్తుంది. కేవలం రోజ్‌వాటర్‌కి కొన్ని చుక్కల జాస్మిన్‌/ లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ కొన్ని చుక్కలు కలిపి తలంతా స్ప్రే చేసి, మృదువుగా మర్దన చేస్తే రక్తప్రసరణ మెరుగవడంతోపాటు కురులూ సువాసన వెదజల్లుతాయి.

కళ్లు అలసినా, ఉబ్బినట్లు కనిపించినా, డార్క్‌ సర్కిల్స్‌కీ మంచి పరిష్కారమే. దూది ఉండని గులాబీనీటితో తడిపి వాటిని 5-10 నిమిషాలు కళ్లమీద ఉంచుకుంటే సరి. కొన్ని రోజులు క్రమం తప్పకుండా దీన్ని ప్రయత్నించి చూడండి.

స్నానం నీటిలో ఒక కప్పు రోజ్‌వాటర్‌ కలపండి. చర్మం ఆరోగ్యంగా, మెరవడంతోపాటు ఒత్తిడీ దూరమవుతుంది. పడుకోబోయే ముందు దిండు మీద స్ప్రే చేస్తే.. మెదడు విశ్రాంతి పొందుతుంది. నిద్రా బాగా పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్