వాయుకాలుష్యం... పుట్టబోయే బిడ్డకు శాపం

పుట్టబోయే పాపాయి సంరక్షణ బాధ్యత గర్భం దాల్చినప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ప్రసవానికి ముందు నుంచి విటమిన్లు, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడంతోపాటు మొత్తం లైఫ్‌స్టైల్‌ను మార్చుకోగలిగితేనే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. కాబోయే తల్లి పీల్చే గాలి కాలుష్య ప్రభావం గర్భస్థశిశువుపై పడుతుంది. ముఖ్యంగా...

Published : 26 Dec 2021 00:51 IST

గర్భిణిగా ఉన్నప్పుడు వాతావరణ కాలుష్య ప్రభావం పడితే బిడ్డకు ఆరోగ్య సమస్యలెదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఏం చెబుతున్నారంటే...

పుట్టబోయే పాపాయి సంరక్షణ బాధ్యత గర్భం దాల్చినప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ప్రసవానికి ముందు నుంచి విటమిన్లు, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడంతోపాటు మొత్తం లైఫ్‌స్టైల్‌ను మార్చుకోగలిగితేనే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. కాబోయే తల్లి పీల్చే గాలి కాలుష్య ప్రభావం గర్భస్థశిశువుపై పడుతుంది. ముఖ్యంగా... ప్రసవంలో శిశు మరణాలెక్కువగా ఉంటాయి. లేకపోతే గర్భంలో శిశువు అవయవాల ఎదుగుదలపై దుష్ప్రభావాల్ని చూపుతుంది. దీంతో పాపాయికి జీవితమంతా ఆరోగ్య సమస్యలెదురవుతాయి. టాక్సిక్‌ సాలిడ్‌, లిక్విడ్‌ పార్టికిల్స్‌ల సమ్మేళనం గాలిలో ఉన్నప్పుడు దాన్ని గర్భిణులు పీలిస్తే ప్రీమెచ్యూర్‌ బర్త్‌, లేదా తక్కువ బరువుతో శిశువు పుట్టడం జరుగుతాయి. మెదడు ఎదుగుదల సమస్యలతో పాటు నరాల అభివృద్ధిపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఆటిజం వచ్చే అవకాశాలూ ఎక్కువ. భవిష్యత్తులో ఆస్త్మా వంటి శ్వాస సమస్యలు ఎదురవుతాయి. కాలుష్యరహిత వాతావరణంలో ఉంటే ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించొచ్చు. గర్భిణులు తప్పక బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కులు, లేదా ఎయిర్‌ ఫిల్టర్స్‌ వాడాలి. ఇంట్లో, పరిసరాల్లో వీలైనంత  పచ్చదనం ఉండేలా జాగ్రత్తపడాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్