వంటింట్లోనే.. బయోటిన్‌!

జుట్టు రాలుతోందంటే మనకు బెంగ. అందుకే చాలామంది.. బయోటిన్‌ను తీసుకుంటారు. విటమిన్‌ బి7గా పిలిచే దీన్ని వైద్యులూ సూచిస్తారు. దీనికి డబ్బు పెడుతున్నారా? ఎందుకండీ.. రోజువారీ ఆహారంలో కొన్నింటిని చేర్చుకుంటే సరిపోతుంది.

Published : 03 Jan 2022 01:31 IST

జుట్టు రాలుతోందంటే మనకు బెంగ. అందుకే చాలామంది.. బయోటిన్‌ను తీసుకుంటారు. విటమిన్‌ బి7గా పిలిచే దీన్ని వైద్యులూ సూచిస్తారు. దీనికి డబ్బు పెడుతున్నారా? ఎందుకండీ.. రోజువారీ ఆహారంలో కొన్నింటిని చేర్చుకుంటే సరిపోతుంది.

* గుడ్డు పచ్చసొనలో బయోటిన్‌ ఎక్కువ మోతాదులో ఉంటుంది. రోజుకో గుడ్డును ఆహారంలో చేర్చుకుంటే సరి! బరువును తగ్గించడంలో సాయపడే తృణధాన్యాల్లోనూ ఈ విటమిన్‌ ఉంటుంది. వీటితో అదనంగా శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలూ లభిస్తాయి.

* అరకప్పు ఉడకబెట్టిన చిలగడ దుంపలో 2.4 మైక్రోగ్రాముల బయోటిన్‌ ఉంటుంది. వాల్‌నట్స్‌, పల్లీలు, బాదంలను కలిపి రోజూ గుప్పెడు తీసుకుంటే చాలు. మీ కురుల సమస్యలన్నీ దూరమవుతాయి.

* పోషకాలు అధిక మోతాదులో ఉండే బటన్‌ పుట్టగొడుగులనూ ఈ జాబితాలోకి చేర్చేసుకోవచ్చు. అరటిపండులోనూ బయోటిన్‌ శాతం ఎక్కువే. అదనంగా పీచు, సూక్ష్మ పోషకాలు, బి గ్రూపు విటమిన్లు, కాపర్‌, పొటాషియంలనూ అందిస్తుంది. ఆకుకూరలు... ముఖ్యంగా పాలకూరను ఎక్కువగా తీసుకుంటే కురులు బాగా పెరగడమేకాదు.. శరీరానికి అవసరమైన శక్తీ అందుతుంది. కాలేయ మాంసంతోనూ దీన్ని భర్తీ చేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్