పాదాల పగుళ్లకూ ఆసనం...

ఈ కాలంలో కళ్ల వెంట నీళ్లు కారడం, చర్మం పొడిబారడం, పాదాల పగుళ్లు లాంటి సమస్యలు వేధిస్తాయి. కొన్ని తేలికైన ఆసనాలతో వాటి నుంచి బయటపడొచ్చు..

Published : 04 Jan 2022 20:59 IST

ఈ కాలంలో కళ్ల వెంట నీళ్లు కారడం, చర్మం పొడిబారడం, పాదాల పగుళ్లు లాంటి సమస్యలు వేధిస్తాయి. కొన్ని తేలికైన ఆసనాలతో వాటి నుంచి బయటపడొచ్చు..


కపోల శక్తి వికాసం

మన హావభావాలన్నీ ముఖంతోనే చూపిస్తాం కదా! ఈ ఆసనంతో కండరాలు బలం పుంజుకోవడాన ముఖం పొడిబారదు. పైగా వర్ఛస్సు పెరుగుతుంది. నరాలు ఉత్తేజితమవుతాయి. ప్రశాంతంగా కూర్చుని గాఢంగా శ్వాస తీసుకుని రెండు బుగ్గలూ బూరలా ఉబ్బించాలి. రెండు ముక్కులూ బొటనవేళ్లతో మూసి తల కొంచెం కిందికి వాల్చి కొద్దిసేపు కూర్చోవాలి. తర్వాత మెల్లగా చేతులు తీసేసి ముక్కులతో శ్వాస వదిలేయాలి. ప్రతిసారీ బుగ్గలు ఉబ్బించి ఒత్తిడితేవాలి. ఇలా ఓ ఐదుసారు చేస్తే ముఖం కాంతివంతమవుతుంది, చర్మం శుద్ధి అవుతుంది.


జలముద్ర

చలికి చర్మం ముడతలు పడటం, పొడిబారడం, మంట, దురదలతో గోక్కోవడం చూస్తుంటాం. జల ముద్రతో అవన్నీ పోతాయి. మాయిశ్చరైజర్లు రాయకుండానే చర్మం మృదువుగా అవుతుంది. సొరియాసిస్‌తో సహా అన్ని చర్మ వ్యాధులకూ ఇది ఔషధం. ఈ ముద్రలో చిటికెన వేలు మీద బొటనవేలుంచి, తక్కిన వేళ్లు తిన్నగా ఉంచాలి. రెండు చేతులూ మోకాళ్ల మీదుంచి మెల్లగా రెండు ముక్కులతో శ్వాస తీసుకుని వదులుతుండాలి. ఈ ముద్ర ఐదు నిమిషాలు చేయాలి. చర్మం ఎండిపోయినట్లుంటే ఉదయం, సాయంత్రం రెండుసార్లు చేయాలి. జలుబు ఉంటే మాత్రం అది తగ్గిన తర్వాతే ఈ ముద్ర చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్