పాలూ, తేనెలే ఔషధాలు!

శీతగాలుల ప్రభావంతో ముఖం పొడారిపోతుంటుంది. ఏం చేయాలి అంటారా? సహజసిద్ధ పదార్థాలతోనే చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

Updated : 06 Jan 2022 05:06 IST

శీతగాలుల ప్రభావంతో ముఖం పొడారిపోతుంటుంది. ఏం చేయాలి అంటారా? సహజసిద్ధ పదార్థాలతోనే చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.
* ఓట్‌మీల్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ఇందులో ఉండే సపోనిన్‌ మొటిమలు, మచ్చలు రాకుండా సంరక్షిస్తుంది. మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
* గ్లిజరిన్‌, పాలు వంటి వాటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇవి ముఖంపై మురికి, నూనె వంటి వాటిని తొలగిస్తాయి. మేకప్‌ను తీసేశాక కూడా వీటితో క్లెన్సింగ్‌ చేయాలి.
* పాలల్లో ముంచిన దూది ఉండతో ముఖాన్ని మృదువుగా రుద్ది ఆరనిచ్చి శుభ్రపరిస్తే చాలు. ఇందులోని లాక్టిక్‌, ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు పొడారే చర్మానికి ఔషధంలా పనిచేస్తాయి.
తేనె, గులాబీనీరు వంటి వాటిలోని వ్యాధినిరోధక గుణాలు మచ్చలను దూరం చేస్తాయి. గులాబీ నీరు చర్మంలోని పీహెచ్‌ స్థాయులను సమన్వయం చేసి, తాజాగా ఉంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్