వయసును దాచే బీట్‌రూట్‌!

చర్మం, జుట్టు రెండింటికీ చలితో ఎన్నో సమస్యలు. వీటికి  బీట్‌రూట్‌తో చెక్‌ చెప్పేయొచ్చట.దీనిలో ఆల్ఫా లినోయిక్‌ ఆమ్లం అనే యాంటీ ఆక్సిడెంట్‌ అధిక మోతాదులో ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌పై ప్రభావం చూపి.

Updated : 29 Feb 2024 16:19 IST

చర్మం, జుట్టు రెండింటికీ చలితో ఎన్నో సమస్యలు. వీటికి  బీట్‌రూట్‌తో చెక్‌ చెప్పేయొచ్చట.

* దీనిలో ఆల్ఫా లినోయిక్‌ ఆమ్లం అనే యాంటీ ఆక్సిడెంట్‌ అధిక మోతాదులో ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌పై ప్రభావం చూపి.. వృద్ధాప్య ఛాయలు రానివ్వదు. ఈ కాలంలో చర్మం జీవం కోల్పోయినట్టుగా అవుతుంది కదా! దీనిలో ఎక్కువ మోతాదులో ఉండే ఇనుము, కెరొటినాయిడ్లు దీనికి వ్యతిరేకంగా పనిచేసి, చర్మాన్ని మెరిపిస్తాయి. రక్తాన్నీ శుభ్రపరుస్తాయి.

* చర్మం పగిలి దద్దుర్లు వచ్చిన చోట దీని రసాన్ని పూయండి. ఫలితం ఉంటుంది. మొటిమలకీ మంచి మందు. సౌందర్య ఉత్పత్తుల పరిశ్రమలో దీన్ని బాగా ఉపయోగిస్తారు. దీనిలోని విటమిన్‌ సి మెలనిన్‌ను తగ్గిస్తుంది.

* దీన్ని కూర, రసం రూపంలో తరచూ తీసుకుంటే సరి. దీనిలోని ఇనుము, ఎలక్ట్రోలైట్స్‌, పొటాషియం జుట్టు నిర్జీవంగా తయారవకుండా చూస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్