Diabetes:శోధించి.. సూది బాధ నుంచి విముక్తి..!
ఆ అమ్మాయికి పుట్టినప్పుడే మధుమేహం... రోజూ నాలుగైదు సార్లు రక్తపరీక్షలు... ఇన్సులిన్లు...
గ్లూకోమీటర్‌ను ఆవిష్కరించిన మధుమేహ బాధితురాలు
ఆ అమ్మాయికి పుట్టినప్పుడే మధుమేహం... రోజూ నాలుగైదు సార్లు రక్తపరీక్షలు... ఇన్సులిన్లు... వాటితోనే పెరిగింది తను. ఊహ తెలిశాక ఆ బాధేంటో అర్థమయింది. ఇంకాస్త పెరిగాక... తనలాంటి వారి గురించి ఆలోచించేది. ఆ అమ్మాయే ఇప్పుడు సూది గుచ్చకుండా చక్కెర స్థాయులను గుర్తించే గ్లూకోమీటర్‌ను రూపొందించింది. 20 ఏళ్ల దువ్వూరు వర్షితారెడ్డి వసుంధరతో పంచుకున్న కథ ఇది...
మా నాన్న సుగుణాకర్ రెడ్డి రైతు. అమ్మ విజయలక్ష్మి గృహిణి. పుట్టినప్పుడు నాకు టైప్ ఒన్ డయాబెటిస్ ఉంది. ఇది తగ్గదు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులను తెలుసుకోవడం కోసం రోజూ నాలుగైదు సార్లు రక్తపరీక్షలు చేయించుకోవాలి. ఎదిగే కొద్దీ నొప్పి తెలియడం మొదలైంది. పాఠశాల స్థాయిలో ఇంకా బాధపడే దాన్ని. ఒక్కోసారి రక్తం తీస్తున్నప్పుడు భరించలేకపోయే దాన్ని. బడిలో, కాలేజీలో మరీ ఇబ్బంది. ఓవైపు నొప్పి, మరోవైపు అందరూ చూస్తున్నారని బాధ. ఒకానొక దశలో సూదంటేనే భయం వేసేది.
చేయూత దొరికింది...
తప్పదు కదా... మధుమేహం జీవితంలో ఓ భాగమైపోయింది. కానీ ఒక్కొక్క సారీ పరీక్షకు రూ.40 చొప్పున రోజుకి రూ.160 అయ్యేది. నెలకు దాదాపు రూ.4, 5వేలు. ఎవరికైనా ఇదే బాధ, ఖర్చు. పేదలైతే ఎలా తట్టుకుంటారనే ఆలోచన మనసును తొలుస్తూ ఉండేది. పరిష్కారం ఏంటా అని ఆలోచించే దాన్ని. ఇంటర్ అయ్యాక, 2017లో చెన్నై డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చి ఇన్స్టిట్యూట్లో బీఎస్సీ, బయో టెక్నాలజీలో చేరా. రెండో ఏడాదిలో ఉన్నప్పుడే రక్తంలో చక్కెర స్థాయిలను కనిపెట్టే పరికరం తయారీపై ఓ ఆలోచన ఉండేది. అయితే నేను జీవశాస్త్ర పరిశోధకురాలిని మాత్రమే. ఆ సమయంలోనే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో విమల్‌తో పరిచయమైంది. తను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీర్. తనతో కలిసి నా ఆలోచనకు రూపాన్ని ఇవ్వగలిగా. ఇద్దరం కలిసి ‘వివాలైఫ్ ఇన్నోవేషన్స్’ను స్థాపించాం. ఆ తర్వాత మా స్టార్టప్ ‘ఈజెడ్ఎల్వైఎఫ్ (ఈజీలైఫ్)కి కేంద్ర ప్రభుత్వ ‘నిధి ప్రయాస్’ ప్రాజెక్టు కింద ఈరోడ్ కొంగో ఇంజినీరింగ్ కాలేజీ ద్వారా రూ.7.5 లక్షలు మంజూరయ్యాయి. దీంతో గతేడాది హైదరాబాద్‌కు వచ్చి పని మొదలుపెట్టాం. ఇక్కడ చాలా పోటీల్లోనూ గెలిచాం. ఇవన్నీ మంచి నెట్వర్క్ దొరికేలా చేశాయి.
సాధించినవి...
‘టై వుమెన్ గ్లోబల్ పిచ్- 2021’ రీజనల్ ఛాప్టర్ విన్నర్. దుబాయిలో ‘టై గ్లోబల్ పిచ్’కు హైదరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని అందుకున్నా. ‘ఎన్ఐటీటీఈ హెల్త్‌కేర్ హ్యాక్‌థాన్’లో విజేత. ఎంపవర్ ఇండియా ఫైనల్స్‌లో రెండో రన్నరప్. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గుర్తింపు.
అందరికీ పరీక్షలే!
ఈజీలైఫ్ డివైస్‌ను చాలా తక్కువ సమయంలో అభివృద్ధి చేయగలిగాం. ఇది జేబులో ఇమిడిపోతుంది. స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానం చేసి దానిపై వేలును ఉంచితే చాలు... రక్తంలోని చక్కెర స్థాయులను చెప్పేస్తుంది. ప్రయోగాత్మకంగా నేనే టెస్ట్ చేసుకునే దాన్ని. మా చుట్టుపక్కల మధుమేహం ఉన్న వారిని, లేని వారిని పరీక్షించే వాళ్లం. అలా ప్రీ క్లినికల్ ఎవాల్యుయేషన్ టెస్ట్స్ నిర్వహించాం. వీటన్నింటినీ ల్యాబొరేటరీ టెస్ట్ రిపోర్ట్స్‌తో, మరో డివైస్ పరీక్షా ఫలితాలతో పోల్చి చూసే వాళ్లం. క్రమంగా మెరుగుపరచుకుంటూ మా ఈజీలైఫ్ ఫలితాల్లో 91 శాతం కచ్చితత్వం సాధించాం. సాధారణంగా 88 శాతం ఉంటే మార్కెట్లోకి విడుదల చేయొచ్చు. అయినా కచ్చితత్వాన్ని 94 - 97 శాతం వరకూ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. రక్తంలో చక్కెరను పూర్తి స్థాయిలో పరీక్షించాలి... అతి తక్కువ ఖర్చుతో ఈ పరీక్ష చేసుకునేలా ఉండాలి.... ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలి... ఈ మూడూ నా ఆశయాలు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాన్న చనిపోతే ఆ తర్వాత అమ్మే అన్నీ చూసింది. ఇప్పుడు నన్ను చూస్తే గర్వంగా అనిపిస్తోందని తను అంటుంటే సంతోషంగా ఉంటుంది. ఈజీలైఫ్ ఒక కొలిక్కి వచ్చాక మరిన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారాల కోసం ప్రయత్నిస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!