అమ్మలకీ కావాలి సంరక్షణ

గర్భం దాల్చినప్పటి నుంచి, ప్రసవం వరకు శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతాం. ఆరోగ్యపరంగానూ ఎన్నో మార్పులు. మరీ.. సంరక్షణ కావాలిగా! పాపాయినే కాదు మీ గురించీ జాగ్రత్త తీసుకోండి.

Updated : 13 Jan 2022 06:32 IST

గర్భం దాల్చినప్పటి నుంచి, ప్రసవం వరకు శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతాం. ఆరోగ్యపరంగానూ ఎన్నో మార్పులు. మరీ.. సంరక్షణ కావాలిగా! పాపాయినే కాదు మీ గురించీ జాగ్రత్త తీసుకోండి.

ప్రసవంలో గర్భాశయం వ్యాకోచించడం, హార్మోన్లలో మార్పులు వంటివెన్నో చోటు చేసుకుంటాయి. మానసికంగానూ ఒత్తిడి, ఆందోళన. శస్త్రచికిత్స జరిగితే ఆ ప్రభావం కూడా శరీరంపైనే పడుతుంది. తీవ్ర అలసట వస్తుంది. దీనికితోడు పాపాయి సంరక్షణకే సమయమంతా కేటాయించాలి. ఫలితంగా నిద్రలేమి. అదీకాక తిండి తగ్గించడమో, చిన్నారికి పోషకాలు అందవేమోనని అతిగా తినేయడమో చేస్తుంటాం. ఇంకేముంది బరువు సమస్య మొదలవుతుంది. ప్రసవానంతరం కనీసం 30 రోజులు శరీరానికి పూర్తి విశ్రాంతినివ్వాలి. తర్వాతే ఆహార, వ్యాయామ నియమాలను మొదలుపెట్టాలి. చిన్నారి ఆరోగ్యం తల్లిపాలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి.. విటమిన్లు, ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యమివ్వండి. అది మీకూ సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది. ముందు చిన్న వ్యాయామాలకే ప్రాధాన్యమివ్వండి. ఇంట్లోనే ఓ అరగంట నడవండి. ఆపై వైద్యుల సలహాతో వారానికి 2, 3 రోజులు తేలికపాటి వ్యాయామాలు చేయండి. యోగా, ధ్యానం వంటివి మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్