ఆరోగ్యానికి క్రాంతి!

రేగు పళ్లలో పోషకాలు, ఔషధ గుణాలు ఎక్కువ. వీటిలో విటమిన్‌ సి, ఎ, పొటాషియం అధికం. వీటితో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటివి దూరమవుతాయి. ఒత్తిడిగా ఉన్నప్పుడు నాలుగు పండ్లు తింటే

Published : 14 Jan 2022 01:14 IST

సంక్రాంతి అంటే... రేగు పళ్లూ, చెరకు గడలే. మరి అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో చూడండి...!

రేగు పళ్లలో పోషకాలు, ఔషధ గుణాలు ఎక్కువ. వీటిలో విటమిన్‌ సి, ఎ, పొటాషియం అధికం. వీటితో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటివి దూరమవుతాయి. ఒత్తిడిగా ఉన్నప్పుడు నాలుగు పండ్లు తింటే ఫలితం ఉంటుంది. రేగులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. కాలేయం పని తీరును మెరుగుపరుస్తుంది. మనకి అవసరమయ్యే 24 రకాల అమైనో ఆమ్లాలలో 18 రేగులో లభిస్తాయట. వీటిల్లోని సుగుణాలు.. చర్మానికి మేలు చేస్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం ఉండదు. ఆకలిని పెంచుతుంది. నీరసంగా ఉన్నప్పుడు కొన్ని రేగు పళ్లు తిని చూడండి. వీటిల్లోని ఎనర్జీ బూస్టర్లు తక్షణ శక్తినిస్తాయి. పిల్లలకు చాలా మంచివి. మందమతులుగా ఉన్న పిల్లలచేత రోజూ కాసిన్ని రేగుపండ్లు తినిపిస్తే బుద్ధి వికసిస్తుందట. ఈ చెట్టు ఆకులు, బెరడు, గింజల్లో కూడా ఔషధ గుణాలున్నాయి. ఆకు పసరును పుండ్లకి పై పూతగా వాడితే త్వరగా తగ్గుతాయి. వీటిలోని క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం వంటి ఖనిజాలు కండరాలనూ, దంతాలనూ, ఎముకల్నీ దృఢంగా మారుస్తాయి. రక్తం శుద్ధి అవుతుంది. గొంతునొప్పిని, ఆస్తమా, కండరాల నొప్పిని తగ్గించే గుణం వీటిలో ఉంది. రేగు గింజలను పొడి చేసి నూనెతో కలిపి రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

చెరకు గడలు... దీనిలో గ్లూకోజ్‌ శాతం ఎక్కువ. శరీరంలో తేమ కోల్పోయినప్పుడు డీ హైడ్రేట్‌ అవుతుంది. ఈ గడల్లో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, మాంగనీసు ఉంటాయి. ప్రొటీన్లూ ఎక్కువే. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లూ, మంట, నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు గ్లాసు చెరకు రసంలో కొద్దిగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లూ కలిపి తీసుకోవడం మంచిది. ఇవి శరీరంలోని రకరకాల ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ కూడా శుభ్రపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్