నువ్వు... మనం.. ఆరోగ్యం!

నిండుగా నువ్వులు అద్దిన అరిసెల ప్రత్యేకత వేరు. జంతికల్లో కాసిన్ని చేర్చితే ఆ రుచి అమోఘం. నువ్వుండల గురించి ఇక చెప్పేదేముంది? నువ్వులు రుచిని మాత్రమే కాదు  అపారమైన పోషకాలనీ అందిస్తాయి.

Published : 15 Jan 2022 01:45 IST

నిండుగా నువ్వులు అద్దిన అరిసెల ప్రత్యేకత వేరు. జంతికల్లో కాసిన్ని చేర్చితే ఆ రుచి అమోఘం. నువ్వుండల గురించి ఇక చెప్పేదేముంది? నువ్వులు రుచిని మాత్రమే కాదు  అపారమైన పోషకాలనీ అందిస్తాయి.

* రోజూ కాసిని నువ్వులని ఆహారంలో చేర్చుకునే వారికి కొలెస్ట్రాల్‌తోపాటు, ట్రైగ్లిజరాయిడ్లు అదుపులో ఉంటాయట. ఫలితంగా గుండెజబ్బుల నుంచి రక్షణ దొరుకుతుంది. నువ్వుల్లో మేలు చేసే కొవ్వులు ఉండటమే ఇందుకు కారణం అంటున్నాయి అధ్యయనాలు.
* మామూలు నువ్వులతో పోలిస్తే వేయించినవి తింటే మాంసకృత్తులు పుష్కలంగా అందుతాయట. ముఖ్యంగా కండరాల బలానికీ, హార్మోన్లు చురుగ్గా ఉండటానికీ ఇవి ఎంతో మేలు చేస్తాయి.
* మెగ్నీషియం పుష్కలంగా ఉండే నువ్వులు గుండె ఆరోగ్యానికి మేలుచేస్తాయి. నల్లనువ్వులని రోజుకి ఓ రెండు గ్రాములు తీసుకున్నా గుండె కవాటాలు మూసుకుపోయే సమస్య కొంతవరకూ ఉపశమిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
* యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఇవి శీతకాలంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచి అనేక జబ్బుల నుంచి రక్షణనిస్తాయి. విటమిన్‌ బి, ఇ అధికంగా ఉండటం వల్ల చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్