నెలసరి నొప్పికి వేడి నీళ్లు

ఇంట్లో వాళ్లెవరికి బాగోకపోయినా చాలా కంగారు పడతాం. అవసరమైన అన్ని సేవలూ చేస్తాం. కానీ వ్యక్తిగత అనారోగ్యాల్ని మనలో ఎక్కువ శాతం మంది పట్టించుకోం. మనకొచ్చే చిన్న సమస్యలు అశ్రద్ధ వల్ల పెద్దవిగా మారి ఇబ్బందిపెడతాయి.

Updated : 19 Jan 2022 01:29 IST

ఇంట్లో వాళ్లెవరికి బాగోకపోయినా చాలా కంగారు పడతాం. అవసరమైన అన్ని సేవలూ చేస్తాం. కానీ వ్యక్తిగత అనారోగ్యాల్ని మనలో ఎక్కువ శాతం మంది పట్టించుకోం. మనకొచ్చే చిన్న సమస్యలు అశ్రద్ధ వల్ల పెద్దవిగా మారి ఇబ్బందిపెడతాయి. వాటికి సులువైన నివారణ మన చేతిలోనే ఉందంటున్నారు నిపుణులు...

దద్దుర్లు : ఓట్స్‌ను వాడి చూడండి. ఓట్స్‌లో దురదను తగ్గించే (యాంటీ ప్రురైటిక్‌), యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. పలుచని వస్త్రంలో గరిటెడు ఓట్స్‌ను వేసి చిన్న మూటలా స్నానం నీళ్ల బకెట్‌లో ఉంచి తరువాత తీసేయచ్చు. దద్దు వస్తే... కాసిని ఓట్స్‌ను నానబెట్టి మెత్తగా చేసి దురద ఉన్న చోట రాసి కాసేపాగి కడిగెయ్యాలి.

కాలి వేళ్ల మధ్య ఇన్ఫెక్షన్‌... చిన్న టబ్‌లో పాదాలు మునిగేలా వేడి నీళ్లు పోయండి. అందులో పెద్దచెంచా వంట సోడా కలిపి గిలకొట్టండి. ఆ నీళ్లలో పాదాలు పెట్టి కాసేపు కూర్చోండి. ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉంటే వంట సోడాను పేస్ట్‌లా చేసి రాసి, కాసేపుంచి కడిగేసినా ఫలితం ఉంటుంది.

మూత్ర విసర్జనలో మంట : గ్లాసు నీళ్లలో చెంచా సోడా ఉప్పు కలిపి తాగండి. ఇది మూత్రాశయంలో ఆమ్లాలను, బ్యాక్టీరియాను నివారించి మంటను తగ్గిస్తుంది. నెలసరి నొప్పిగా ఉన్నప్పుడూ వేడి నీళ్లసీసా లేదా హాట్‌ పౌచ్‌ను పొట్ట మీద ఉంచుకున్నా ఉపశమనం కలుగుతుంది.

వెయ్యి నుంచి వెనక్కి... నిద్ర పట్టడం లేదా? అయితే కళ్లు మూసుకుని వెయ్యి నుంచి ఏడేసి అంకెల చొప్పున వెనక్కి లెక్కపెట్టమంటున్నారు నిద్రా వైద్య నిపుణులు. 993, 986, 979... ఇలా అన్న మాట. అక్కడక్కడా లెక్కతప్పినా పట్టించునక్కర్లేదు.

విరోచనాలు: ఓ యాపిల్‌ను శుభ్రంగా కడిగి తోలు తీయకుండా సన్నగా తరిగి పళ్లెంలో పెట్టి 15, 20 నిమిషాలు వదిలెయ్యండి. ఆ ముక్కలు గోధుమ రంగులోకి మారాక తినండి. ఇలా రంగు మారినప్పుడు అందులో పెక్టిన్‌, మాలిక్‌, టాంటారిక్‌ ఆమ్లాలు తయారు అవుతాయి. ఇవి పొట్టలో క్షారతత్వాన్ని, వాపుతో కూడిన నొప్పిని తగ్గిస్తాయి. విరోచనాలను అడ్డుకుంటాయి.

దగ్గు: గ్లాసు వేడి నీళ్లలో అర చెక్క నిమ్మకాయ పిండి, రెండు చెంచాల తేనె కలిపి తాగండి.

పొడి కళ్లు: కళ్లు ఒక్కోసారి పొడిబారతాయి. అప్పుడు కింది రెప్పలను రెండు వేళ్లతో పట్టుకుని సున్నితంగా నొక్కండి. ఆ వెంటనే రెప్పలార్పండి. కింది రెప్పల్లో ఉండే గ్రంథులు తేమను కలిగించే స్రవాలను విడుదల చేస్తాయి. రెప్పలార్పడం వల్ల ఆ స్రావాలు గుడ్డంతా పరచుకుని ఊరటనిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్