‘ చర్మ’ సవాలుకి సిద్ధమా?

ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు పెరిగే పని. ఉద్యోగినులకు ఆఫీసు పని అదనం. ఒత్తిడి మామూలేగా! అయితే ఇది మెదడుపైనే కాదు.. చర్మంపైనా ప్రభావం చూపుతుందట. ఏం చేద్దాం మరి? చర్మాన్ని పునరుజ్జీవం చేసుకునే సవాలు తీసుకుంటే సరి! అదెలాగంటే..

Published : 22 Jan 2022 00:55 IST

ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు పెరిగే పని. ఉద్యోగినులకు ఆఫీసు పని అదనం. ఒత్తిడి మామూలేగా! అయితే ఇది మెదడుపైనే కాదు.. చర్మంపైనా ప్రభావం చూపుతుందట. ఏం చేద్దాం మరి? చర్మాన్ని పునరుజ్జీవం చేసుకునే సవాలు తీసుకుంటే సరి! అదెలాగంటే..
ఒత్తిడి సమయంలో చర్మానికి ఎక్కువ పోషణ అవసరమవుతుంది. అందుకే ఈ ప్రక్రియ ఏ ఒక్కరోజులోనే అయిపోదు. కనీసం వారమైనా పడుతుంది. ఒక రోజంతా అలంకరణకు దూరంగా ఉండాలి. అలాగే ముఖంపై మాయిశ్చరైజర్‌ సహా ఏ ఉత్పత్తినీ రాయొద్దు. ముఖాన్ని శుభ్రం చేసి, వదిలేయాలంతే. మేకప్‌లాంటి వాటిల్లోని రసాయనాలు చర్మాన్ని నిర్జీవమే కాదు.. హానీ చేస్తాయి.
రెండో రోజు శుభ్రమైన ముఖానికి చర్మతీరుకు తగిన పూతను వేయండి. ఆపై సీరమ్‌, మాయిశ్చరైజర్‌ రాయండి. ఇది రెండో దశ. ఇక మూడో దశలో తినే ఆహారంపై దృష్టిపెట్టాలి. రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లను ఎక్కువ మొత్తంలో తీసుకునేలా చూసుకోండి. రోజులో కనీసం 7-8 గ్లాసుల నీటిని తాగాలి. ఎక్కువ ఉప్పుతోపాటు వేపుడు, తీపి, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. కనీసం మీరనుకున్న ఫలితం దక్కేవరకైనా వీటి జోలికి వెళ్లొద్దు.
మానసిక ప్రశాంతత కూడా ముఖంపై ప్రభావం చూపుతుంది. ఇందుకోసం వ్యాయామాన్నీ చేర్చుకోండి. అరగంట నడక, యోగా.. ఇలా నచ్చిన దాన్ని ఎంచుకుని చేయండి. రోజూ కనీసం ఏడు గంటల నిద్రను పాటించండి. ఫలితం మీరే చూస్తారు. ప్రయత్నిస్తారా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్