ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కటీ!
లేవగానే రోజంతా ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నారా... అయితే ఓ గ్రీన్ టీతో రోజును ప్రారంభించండి. దీంట్లోని కెఫిన్ బోలెడు శక్తిని అందిస్తుంది. కంటి నిండా నిద్రపోవాలంటే మాత్రం నిద్రకు ముందు ఓ కప్పు చమేలీ టీని గుటకేయండి
లేవగానే రోజంతా ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నారా... అయితే ఓ గ్రీన్ టీతో రోజును ప్రారంభించండి. దీంట్లోని కెఫిన్ బోలెడు శక్తిని అందిస్తుంది. కంటి నిండా నిద్రపోవాలంటే మాత్రం నిద్రకు ముందు ఓ కప్పు చమేలీ టీని గుటకేయండి. ఈ పూలలోని సుగుణాలు నాడులకు సాంత్వన కలిగించి చక్కగా నిద్రపట్టేలా చేస్తాయి. అలాగే ఒత్తిడి, అలసట, బడలికగా అనిపించినప్పుడు పెప్పర్‌మింట్ తేనీరు తీసుకుంటే సరి. దీనిలోని మెథనాల్ నాడులకు విశ్రాంతిని చేకూర్చి మెదడును ప్రశాంతంగా మారుస్తుంది. ఆరోగ్యం బాలేదా... అల్లం, తేనె, నిమ్మరసంతో చేసిన తేనీరు చక్కటి పరిష్కారం. ఇది తక్షణ శక్తితోపాటు రోగనిరోధకతను పెంచి జలుబు, దగ్గుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. దాంతోపాటు తక్షణ శక్తి కావాలంటే బ్లాక్ టీ కంటే మించింది లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.