ఆ వయసులోఈ వ్యాయామాలు మేలు!

వయసుతోపాటు హార్మోన్ల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాయామాలు చేయడం వల్ల ఫిట్‌గానూ, ఆరోగ్యంగానూ ఉండొచ్చని అంటున్నారు నిపుణులు...

Published : 23 Jan 2022 00:48 IST

యసుతోపాటు హార్మోన్ల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాయామాలు చేయడం వల్ల ఫిట్‌గానూ, ఆరోగ్యంగానూ ఉండొచ్చని అంటున్నారు నిపుణులు...

12 నుంచి 18 వయసులో:  ఈ వయసులో ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ వంటి హార్మోన్ల ప్రభావం అధికంగా ఉంటుంది. మరోవైపు ఎముకలు బలం పుంజుకునే వయసు కూడా ఇదే. అందుకే ఈ సమయంలో తగినంత నిద్ర, పోషకాహారానికి ప్రాధాన్యమిస్తూ వ్యాయామాలు చేయాలి. అలాగని అతి వ్యాయామం అసలు మంచిది కాదు. నెలసరులపై ఆ ప్రభావం పడుతుంది.  

18- 40 మధ్య: ఈ వయసులో హార్మోన్ల ప్రభావం టీనేజీలో ఉన్నంత ఉండదు. కానీ నెలసరికి ముందు ఈ ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం వల్లనే శరీరం వెచ్చబడటం, గుండెవేగంగా కొట్టుకోవడం వంటివి జరుగుతాయి. ఈ సమయంలో అలసటకు గురిచేసే వ్యాయామాలు చేయొద్దు. నెలసరి వచ్చిన తర్వాత... హార్మోన్ల ప్రభావం తగ్గుతుంది. ఆ సమయంలో హై ఇంటెన్సిటీ వర్కవుట్లని చేయొచ్చు. అంటే స్క్వాట్స్‌, జంప్స్‌... బరువులు ఎత్తడం వంటివి చేయొచ్చు. మధ్యలో విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. సంతానం కోసం ప్రయత్నించేవాళ్లు అండం ఫలధీకరణ జరిగే సమయంలో తీవ్రత ఎక్కువగా ఉండే వ్యాయామాలు చేయకూడదు. యోగా, నడక వంటి వాటిని ఎంచుకుంటే మేలు.

ప్రసవం తర్వాత... హార్మోన్లలో మార్పులు రావడం, నిద్రలేకపోవడం, కటి కండరాలు బలహీనంగా ఉండటం వంటివి జరుగుతాయి. బరువులు ఎత్తే వ్యాయామాలు ఈ సమయంలో మంచిది కాదు. ఆ ఒత్తిడి పొట్టపై పడే ప్రమాదం ఉంది. అందుకే శరీరం సాధారణ స్థితికి వచ్చేంతవరకూ తేలికపాటి వ్యాయామాలు చేయాలి.

40 తర్వాత: నలభై నుంచి మెనోపాజ్‌ వచ్చే దశలో క్రమంగా హార్మోన్ల ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఇదే సమయంలో ఎముకలు గుల్లబారుతూ వస్తాయి. అందుకే కఠినమైన వ్యాయామాలు చేయకూడదు. ఎముకలు విరిగే ప్రమాదం ఉంది. యోగా వంటివి మంచివి. మెనోపాజ్‌ తర్వాత కూడా తేలిక పాటి వ్యాయామాలే చేయాలి.


ఆహ్వానం

సుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌ చేయొచ్చు. ఇది కంప్యూటర్‌తో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఈ నంబరు సందేశాలకు మాత్రమేనని గమనించగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్