జలుబు దగ్గు ఇట్టే తగ్గుతాయి..
close
Published : 24/01/2022 00:11 IST

జలుబు దగ్గు ఇట్టే తగ్గుతాయి..

చలికాలం జలుబు, దగ్గు లాంటి శ్వాస ఇబ్బందులు పిలవకుండా వచ్చి పడతాయి. ముక్కు బిగుసుకుపోవడం లాంటి అవస్థలూ ఉంటాయి. వాటన్నింటికీ విరుగుడుగా ఈ తేలికైన ఆసనం వేసి చూడండి...

ప్రసారిత పాదోత్థాసనం

నిలబడి కాళ్లను వీలైనంత దూరంగా పెట్టి పడిపోకుండా స్థిరంగా ఉండాలి. రెండు చేతులూ పైన నమస్కార ముద్రలో ఉంచాలి. శ్వాస వదులుతూ ముందుకు వంగి రెండు చేతులూ రెండు కాళ్ల మధ్య నుంచి వెనక్కి తీసుకెళ్లాలి. శ్వాస తీసుకుంటూ కొన్ని అడుగులు వెనక్కి జరగాలి. మళ్లీ శ్వాస వదులుతూ ముందుకి రావాలి. ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఈ ఆసనం వేయడం వల్ల ముక్కు బిగుసుకుపోవడం, ఉన్నట్టుండి ముక్కు కారడం, దుమ్ము వల్ల దగ్గు లాంటి శ్వాస ఇబ్బందులు, అలర్జీలు తగ్గుతాయి. రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఉదర భాగానికి, గుండెకి రక్తసరఫరా సవ్యంగా జరుగుతుంది.


Advertisement

మరిన్ని