కాచిన నూనె మళ్లీ వాడుతున్నారా?

పూరీ, గారెలు వంటివాటికి ఎక్కువ మొత్తంలో నూనె వాడుతుంటాం. చేయడం పూర్తయ్యాక దాన్ని తిరిగి వేరే వంటలకు ఉపయోగిస్తుంటాం. కానీ అది కొన్నిసార్లు రక్తపోటుకు కారణమైతే ఇంకొన్నిసార్లు ఆహారాన్ని విషపూరితమూ

Updated : 27 Jan 2022 04:57 IST

పూరీ, గారెలు వంటివాటికి ఎక్కువ మొత్తంలో నూనె వాడుతుంటాం. చేయడం పూర్తయ్యాక దాన్ని తిరిగి వేరే వంటలకు ఉపయోగిస్తుంటాం. కానీ అది కొన్నిసార్లు రక్తపోటుకు కారణమైతే ఇంకొన్నిసార్లు ఆహారాన్ని విషపూరితమూ చేయొచ్చని తెలుసా? అలా కాకూడదంటే.. ఈ జాగ్రత్తలు పాటించేయండి.

* వేడిగా ఉన్నప్పుడే జాగ్రత్త చేయాలన్న తొందరొద్దు. ముందు చల్లారనివ్వండి. అంతకు ముందు వేయించిన పదార్థాలు ఉండిపోతే అవి నూనెను విషతుల్యం చేస్తాయి. కాబట్టి,  కాఫీ ఫిల్టర్‌, వస్త్రంతో వడపోయాలి. ఆపైనే వేరే వాటికి వినియోగించుకోండి.

* కాగిన నూనెకు మొక్కజొన్న పొడిని కలిపి, తక్కువ మంట మీద వేడిచేయండి. మరగకుండా గరిటెతో కలుపుతూ పిండి కాస్త గట్టిపడినట్లు అనిపించాక దింపి, వడకట్టేస్తే సరి.

* చిన్న మంట మీద నూనెను వేడిచేస్తూ.. నిమ్మకాయను చిన్న ముక్కలుగా కోసి అందులో వేయండి. నూనెలో మిగిలిపోయినవన్నీ ఆ ముక్కలకు అంటుకుంటాయి. ఆపై నూనెను వడకట్టుకుంటే సరిపోతుంది.

* సరిగా భద్రపరచకపోయినా కాగిన నూనె విషపూరితమవగలదు. కాబట్టి, తడి, వెలుతురు, వేడిమికి దూరంగా ఉంచాలి. పొయ్యికి దగ్గరగా ఉన్నా ఆ ప్రభావం దానిపై పడగలదు. బదులుగా ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్