ఏ సమయానికి ఏది మంచిది?

పాలు, పెరుగు, అరటిపండ్లు... ఇవన్నీ ఆరోగ్యానికి మంచివే. కానీ ఏ వేళలో ఏది తినాలో తెలియపోతే మాత్రం మంచికన్నా హానే ఎక్కువగా జరుగుతుందట..

Updated : 28 Jan 2022 05:38 IST

పాలు, పెరుగు, అరటిపండ్లు... ఇవన్నీ ఆరోగ్యానికి మంచివే. కానీ ఏ వేళలో ఏది తినాలో తెలియపోతే మాత్రం మంచికన్నా హానే ఎక్కువగా జరుగుతుందట..

అరటిపండ్లు: పొటాషియం పుష్కలంగా ఉండే అరటిపండ్లని చాలామంది తెలియక రాత్రిపూట తింటూ ఉంటారు. అలా తినడం వల్ల అజీర్తితోపాటు మ్యూకస్‌ చేరడానికి కారణం అవుతాయి. వీటిని వ్యాయామాలు చేయడానికి ముందు తింటే కావాల్సిన శక్తి అంది... శరీరం చురుగ్గా ఉంటుంది. అలాగే మధ్యాహ్న భోజనం తర్వాత తిన్నా మంచిదే. రాత్రి భోజనం తర్వాత మాత్రం వద్దు.


ఆపిల్‌: ఈ పండ్లలోని పెక్టిన్‌ రక్తంలోని చక్కెర స్థాయుల్ని నియంత్రించి... కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుతుంది. పెక్టిన్‌ అరగడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఆపిల్‌ని పొద్దున, మధ్యాహ్నం తినాలి కానీ రాత్రిపూట వద్దు.


అన్నం: కొంతమందికి రాత్రిపూట అన్నం తినకపోతే నిద్రపట్టదు. కానీ అన్నం బరువు పెరగడానికి కారణం అవుతుంది. అందుకే రాత్రిపూట అన్నం తినేవాళ్లు వీలైనంత త్వరగా తినడం అది కూడా తక్కువ తినడం మంచిది.


చికెన్‌: మాంసాహారం... ఏదైనా సరే అరగడానికి ఆరుగంటల సయయం పడుతుంది. అందుకే దీన్ని రాత్రిపూట తినకపోవడమే మంచిది. ఒకవేళ తినాలనుకుంటే గ్రిల్‌ లేదా బేక్‌ చేసిన చికెన్‌ మంచిది.


పాలు: వీటిని ఉదయం పూట కన్నా... రాత్రి నిద్రించే ముందు తాగడం వల్ల ఎక్కువ ఫలితాలు ఉంటాయట. మంచి నిద్ర పట్టి మరుసటి రోజుకి శరీరం చురుగ్గా ఉంటుంది. శరీరానికి అందాల్సిన క్యాల్షియం అందుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్