ఆరోగ్యానికి ఐదు!

ఏడెనిమిది గంటలు కూర్చొనే పని చేయడం, తగ్గిపోయిన నిద్రవేళలు, సరైన సమయానికి ఆహారం తీసుకోక పోవడం... ఇవన్నీ నేటి ఉద్యోగినులకు బరువును పెంచే అంశాలుగా మారాయి. మరి వీటికి

Published : 28 Jan 2022 00:47 IST

ఏడెనిమిది గంటలు కూర్చొనే పని చేయడం, తగ్గిపోయిన నిద్రవేళలు, సరైన సమయానికి ఆహారం తీసుకోక పోవడం... ఇవన్నీ నేటి ఉద్యోగినులకు బరువును పెంచే అంశాలుగా మారాయి. మరి వీటికి విరుగుడు శారీరక శ్రమ చేయడమే. అందుకోసం రోజూ  కనీసం ఓ అరగంట వ్యాయామం చేయాలంటున్నారు నిపుణులు...

నడక... ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఎముక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. బరువు తగ్గడానికి సాయపడుతుంది. కీళ్ల ఆరోగ్యానికి, ఊపిరితిత్తుల సామర్థ్యానికి దోహదం చేస్తుంది. మెనోపాజ్‌ మొదలైన మహిళలపై జరిగిన ఓ అధ్యయనంలో రోజూ 30 నిమిషాలు నడిచిన వారిలో 40శాతం తుంటి ఎముకలు విరగడం తగ్గిందని తెలిసింది. మరో విషయమేటంటే.. దీనికి ఎలాంటి పరికరాలు అక్కర్లేదు.

పరుగు... రోజూ అర గంట తప్పకుండా నడిచే వారు మరింత ఆరోగ్య వృద్ధి కోసం నడకను కాస్త పరుగుగా మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. పరుగు శరీరంలోని కొవ్వును సమర్థంగా కరిగిస్తుంది. అలాగే పొట్టనూ తగ్గిస్తుంది. సౌకర్యవంతమైన బూట్లని అమర్చుకోవడం మాత్రం తప్పనిసరి.

సైకిల్‌ తొక్కడం.. శారీరక శ్రమ, బరువు...ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం తెలుసుకోవడానికి పరిశోధకులు 18000 మంది మహిళలపై, 16 ఏళ్లు పరిశోధనలు చేశారు. ఈ సమయంలో సాధారణ మహిళలు దాదాపు 20 పౌండ్ల బరువు పెరగగా రోజూ దాదాపు అరగంటపాటు శారీరక శ్రమ చేసే స్త్రీల  బరువు ఇతరుల కన్నా తగ్గినట్లు తెలిసింది.

ఈత... శరీరానికంతటికీ చక్కటి వ్యాయామమిది. హృదయ స్పందన రేటును మెరుగుపరుస్తుంది. అలాగే కండరాలను టోన్‌ చేస్తుంది కూడా. కీళ్లనొప్పులున్న మహిళలకు ఇది అనుకూలం.

యోగా.. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్నిచ్చే వ్యాయామం. ఒత్తిడి, బరువును తగ్గిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్