ఆమె ఆరోగ్యానికి... ఆరు ఆవశ్యకాలు!
బాలింత... మెనోపాజ్... ఇలా ప్రతి దశలోనూ మహిళల ఆరోగ్య పరిరక్షణలో విటమిన్లు, ఖనిజాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ సూక్ష్మ పోషకాలను తగినంత మోతాదులో రోజూ తీసుకుంటేనే ఆమె ఆరోగ్యంగా ఉంటుంది. అవేంటో తెలుసుకుందామా..
టీనేజ్... గర్భిణి...బాలింత... మెనోపాజ్... ఇలా ప్రతి దశలోనూ మహిళల ఆరోగ్య పరిరక్షణలో విటమిన్లు, ఖనిజాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ సూక్ష్మ పోషకాలను తగినంత మోతాదులో రోజూ తీసుకుంటేనే ఆమె ఆరోగ్యంగా ఉంటుంది. అవేంటో తెలుసుకుందామా..
విటమిన్-డి... రోగనిరోధకతను పెంచుతుంది. ఎముక ఆరోగ్యం, కండర అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనిలోపంతో బాధపడేవారు వైద్యుల సూచనల మేరకే మాత్రలను వాడాలే తప్ప సొంతంగా వేసుకోవద్దు.
విటమిన్-సి... దీంట్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌తో పోరాడి జబ్బులు రాకుండా కాపాడతాయి. కాబట్టి ఈ పోషకం ఉండే సిట్రస్ పండ్లు, జామ, స్ట్రాబెర్రీలు, బ్రకోలీ, ఆకుపచ్చ మిరియాలను ఆహారంలో చేర్చుకోవాలి.
ఫోలేట్... గర్భిణులకు ఇదెంతో అవసరం. దీని లోపం వల్ల రకరకాల రుగ్మతలతో బిడ్డలు పుడతారు. వైద్యుల సలహాతో దీన్ని గర్భిణులు తప్పకుండా తీసుకోవాలి. సిట్రస్ పండ్లు, గుడ్లు, చిక్కుడు జాతి విత్తనాలు, ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి.
మెగ్నీషియం... ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి కంటినిండా నిద్రను తెచ్చిపెడుతుంది. అలాగే రోగనిరోధకతనూ పెంచుతుంది. 31 ఏళ్లు, అంతకు పైబడిన మహిళలు రోజూ కనీసం 320 మైక్రోగ్రాముల మెగ్నీషియం తీసుకోవాలట. ఇందుకోసం అరటిపండు, బాదం, గుమ్మడి గింజలు, పుచ్చవిత్తనాలు, పల్లీలు, పెరుగు, పాలకూర, డార్క్ చాక్లెట్ లాంటివి తీసుకోవాలి.
క్యాల్షియం... ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. రక్తనాళాలు, నాడులు, హార్మోన్లు చక్కగా పనిచేయడానికి తోడ్పడుతుంది. ఈ ఖనిజం లోపం వల్ల నాడుల క్షీణత, కీళ్లనొప్పులు, ఎముకలు గుల్లబారడం లాంటి ఇబ్బందులొస్తాయి. కాబట్టి ఇది ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, చియా విత్తనాలు, సెనగలు, బాదం లాంటివి తీసుకోవాలి.
ఇనుము.. హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్ వృద్ధికి తోడ్పడుతుంది. ఈ ధాతువు లోపం వల్ల తల తిరగడం, అలసట, రక్తహీనత లాంటి సమస్యలు కనిపిస్తాయి. కార్జం, మాంసం, పల్లీలు, కిస్‌మిస్, ఆకుకూరలు, పండ్లు, గోధుమలు, లెగ్యూమ్ జాతి గింజల్లో ఎక్కువగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.