కరివేపాకు ఎంత మంచిదో...

గృహిణులందరికీ కరివేపాకంటే బోల్డంత ఇష్టం. కూర, చారు తాలింపులో అది తెచ్చే ఘుమాయింపు అలాంటిది మరి. అయితే పళ్లెంలోకి చేరగానే పక్కనపెట్టే వారే ఎక్కువ. అది ఎంత మంచిదో, దానిలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో తెలిస్తే ఇకపై ఆ పని చేయరు.

Updated : 01 Feb 2022 04:00 IST

గృహిణులందరికీ కరివేపాకంటే బోల్డంత ఇష్టం. కూర, చారు తాలింపులో అది తెచ్చే ఘుమాయింపు అలాంటిది మరి. అయితే పళ్లెంలోకి చేరగానే పక్కనపెట్టే వారే ఎక్కువ. అది ఎంత మంచిదో, దానిలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో తెలిస్తే ఇకపై ఆ పని చేయరు.

* కరివేపాకులో ఎ, బి, సి విటమిన్లు ఉన్నందున కళ్లకు మంచిది. నోటిపూతలు, చూపు సమస్యలు, రావు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ప్రొటీన్లు, మినరల్స్‌, ఐరన్‌, ఉన్నందున ఎనీమియా సమస్య ఉత్పన్నం కాదు.

* ఇందులో పీచుపదార్థం అధికంగా ఉన్నందున మలబద్ధక సమస్యను నివారిస్తుంది. క్యాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువే. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు అనేక వ్యాధులు, ఇన్‌ఫెక్షన్‌ల నుంచి కాపాడతాయి.

* ఇది కాలేయానికి మంచిది. చర్మరక్షణకు దోహదం చేస్తుంది. పైత్యం, తల తిరగడం, మధుమేహం లాంటి అనేక సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా గర్భిణుల్లో  వికారానికి విరుగుడుగా పనిచేస్తుంది.

* కొన్ని ఆకులను నీళ్లలో మరిగించి వడకట్టి తాగితే జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి. తెల్లజుట్టు సమస్య నివారణ అవుతుంది.

* రోజూ పరగడుపున నాలుగైదు ఆకులు తింటే ఊబకాయం రాదు. ఈ ఆకుని వేయించి పొడి చేసుకుంటే ఇరవై రోజుల వరకూ తాజాగానే ఉంటుంది. దీనితో చేసే రోటి పచ్చడి నాలుగైదు రోజులు నిలవుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్