పొట్ట తగ్గాలా?

సిజేరియన్‌, గంటలపాటు కూర్చొనే పని.. మనకెన్ని కారణాలో పొట్ట పెరగడానికి! ఆన్‌లైన్‌ తరగతులతో అమ్మాయిల్లోనూ ఈ సమస్య తలెత్తుతోంది. వీటిని ప్రయత్నించి చూడండి. సమస్య దూరమవుతుంది.

Updated : 06 Feb 2022 05:13 IST

సిజేరియన్‌, గంటలపాటు కూర్చొనే పని.. మనకెన్ని కారణాలో పొట్ట పెరగడానికి! ఆన్‌లైన్‌ తరగతులతో అమ్మాయిల్లోనూ ఈ సమస్య తలెత్తుతోంది. వీటిని ప్రయత్నించి చూడండి. సమస్య దూరమవుతుంది.

* తగ్గడం.. అన్న మాట వినగానే తినకుండా ఉండటమే అన్న అభిప్రాయం మనలో చాలామందికి. ముందు దాన్ని పక్కన పెట్టేయండి. సమయాలను నిర్ణయించుకుని వాటి ఆధారంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేలా ప్రణాళిక చేసుకోండి. ఆ వేళలను కచ్చితంగా పాటించేలా చూసుకోండి. విపరీతమైన వ్యాయామమూ ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది. అది పొట్ట దగ్గర కొవ్వు తగ్గిస్తుందేమో కానీ.. వేరే అనారోగ్యాలకీ కారణమవుతుంది. తేలిక, మధ్యస్థాయి వాటికే ప్రాధాన్యమివ్వండి.

* ఉదయం పనిలో పడో, అది పూర్తయ్యాక ఆసక్తి నశించో చాలాసార్లు తిండి మానేస్తుంటాం. ఈ తీరేమో కడుపుబ్బరానికి దారి తీస్తుంది. ఇదీ పొట్ట ఉబ్బుగా కనిపించడానికి కారణమే. సమయం కుదరట్లేదు అన్నప్పుడు చిన్న చిన్న మొత్తాల్లో.. లేదా త్వరగా ముగించగల ఆరోగ్యకరమైన స్నాక్స్‌, పండ్లు, నట్స్‌ లాంటివి తీసుకోండి.

* రోజూ కొన్ని అడుగులు చొప్పున నడవాలన్న నియమాన్ని పెట్టుకోండి. ఇది ఫిట్‌నెస్‌ రొటీన్‌ను కొనసాగించేలా చేస్తుంది. పైగా ఇది శరీరమంతటికీ వ్యాయామమే.

* సరైన మొత్తంలో నీటిని తీసుకోకపోయినా గ్యాస్‌ సమస్య తలెత్తుతుంది. గుర్తుంచుకుని మరీ మంచి నీటిని తాగుతుండాలి. మర్చిపోతామనుకుంటే అలారం అయినా పెట్టుకోవాలి. ఇది శరీరాన్ని తాజాగానూ ఉంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్