జుట్టు బలంగా ఉండాలంటే..

మహిళల్లో కనిపించే పోషకాహార లోపం, జుట్టు రాలిపోవడం, త్వరగా అలసిపోవడం లేదా నీరసించడం లాంటి అనేక సమస్యలకు  బీట్‌రూట్‌ ఔషధంలా పనిచేస్తుంది. శారీరక ఆరోగ్యాన్నీ దృఢత్వాన్నీ ఇచ్చే బీట్‌రూట్‌ను తరచుగా తినమంటున్నారు ఆహార నిపుణులు.

Published : 06 Feb 2022 01:07 IST

మహిళల్లో కనిపించే పోషకాహార లోపం, జుట్టు రాలిపోవడం, త్వరగా అలసిపోవడం లేదా నీరసించడం లాంటి అనేక సమస్యలకు  బీట్‌రూట్‌ ఔషధంలా పనిచేస్తుంది. శారీరక ఆరోగ్యాన్నీ దృఢత్వాన్నీ ఇచ్చే బీట్‌రూట్‌ను తరచుగా తినమంటున్నారు ఆహార నిపుణులు.

* నెలసరి సమయంలో చాలామంది అమ్మాయిలు ఐరన్‌ తగ్గి బాధపడుతుంటారు. బీట్‌రూట్‌లో ఇది సమృద్ధిగా ఉంటుంది. దీనిలోని మెగ్నీషియం, జింక్‌, కాపర్‌ తదితరాలు అమ్మాయిలకు మంచి పోషకాహారం. క్యాలరీలు అధికంగా లేకపోవడాన ఊబకాయం వస్తుందన్న బెంగలేదు. తగినంత బరువుతో ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు బీట్‌రూట్‌ తరచుగా తింటుండాలి.

* మెదడుతో సహా శరీర భాగాలన్నిటికీ రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులోని పొటాషియం జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతుంది. కాళ్లనొప్పులూ, బలహీనత రాకుండా చేస్తుంది.

* శరీరానికి పుష్టినిచ్చి ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది. కనుకనే క్రీడాకారులెందరో బీట్‌రూట్‌ రసాన్ని తప్పక తీసుకుంటారు. వ్యాయామం చేసే మహిళలు రోజుకు రెండు కప్పులు తాగితే మంచిది.

* ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నందున నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. అధిక కొవ్వును కరిగిస్తుంది. యాంటీ క్యాన్సర్‌ గుణాలు ఉన్నందున కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. హృద్రోగాలతో బాధపడుతున్నవారు తమ ఆహారంలో బీట్‌రూట్‌ ఉండేలా చూసుకోవడం మంచిది.

* జ్యూస్‌ రూపంలో తాగలేమనుకున్నవారు కూర లేదా హల్వా రూపంలో చేసుకు తినొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్