వేడి ఆవిర్లను తగ్గించే అవిసెగింజలు!

కుటుంబ సభ్యుల గురించి ప్రతి క్షణం ఆలోచించే మహిళ తన ఆరోగ్యాన్ని మాత్రం సరిగా పట్టించుకోదు. సరైన పోషకాహారం తీసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. మరి అందుకోసం

Published : 07 Feb 2022 00:12 IST

కుటుంబ సభ్యుల గురించి ప్రతి క్షణం ఆలోచించే మహిళ తన ఆరోగ్యాన్ని మాత్రం సరిగా పట్టించుకోదు. సరైన పోషకాహారం తీసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. మరి అందుకోసం ఆమె ఏయే పదార్థాలు తీసుకోవాలో చూద్దాం...

ఆకుకూరలు... వీటిలో ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు సి, కె మెండుగా ఉంటాయి. ఇవి మహిళల్లో రక్తహీనత లేకుండా, ఎముకలు బలంగా ఉండటానికి సాయపడతాయి.

నట్స్‌.. ఈ ఎండుగింజల్లో విటమిన్లు, మినరల్స్‌, కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇవి ఎముక ఆరోగ్యంతోపాటు మెదడునూ చురుగ్గా ఉంచుతాయి. కాబట్టి రోజూ బాదం, కాజూ, వాల్‌నట్స్‌, పిస్తాలన్నీ కలిపి ఓ గుప్పెడైనా తినేయండి.

టొమాటోలు... ఇవి రొమ్ము, సర్వైకల్‌ క్యాన్సర్‌లు రాకుండా అడ్డుకుంటాయట. అలాగే గుండె సంబంధ సమస్యలను కూడా.

అవిసె గింజలు... ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచు మెండుగా ఉంటాయి. వీటిలోని లిగ్నన్స్‌ అనే సమ్మేళనాలు స్త్రీలలో మెనోపాజ్‌ సమయంలో వచ్చే వేడి ఆవిర్లు, చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గిసాయి. అంతేకాదు రొమ్ము క్యాన్సర్‌ రాకుండా పోరాడతాయి.

క్యారెట్‌... ఇది నాడులకు శక్తిని అందిస్తుంది. దీనిలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. మెండుగా ఉండే విటమిన్‌ ఎ కంటి ఆరోగ్యంతోపాటు చర్మాన్ని మెరిపిస్తుంది.

గ్రీన్‌ టీ... ఇది క్యాన్సర్‌ కారకాలు, గుండె జబ్బులతో పోరాడతుంది. అంతేకాదు మతిమరుపుని అడ్డుకుంటుంది.

వీటన్నింటితోపాటు అరటిపండు, అవకాడో, డార్క్‌చాక్లెట్‌, యాపిల్స్‌, చేపలు, బ్రకోలీ, పాలు, సోయా, పెరుగు, గుడ్లను ఆహారంలో చేర్చుకోవాలి. నీళ్లు శరీరంలోని మలినాలు, విషపదార్థాలను బయటకు పంపుతాయి. ఇందుకోసం రోజులో ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్