5 వేల అడుగులు చాలు...

సునీతకు ఉదయాన్నే నడక అలవాటు. ఎంత పనున్నా ఓ అరగంట నడవాల్సిందే. కానీ కనీసం 10వేల అడుగులైనా వేయాలనే స్నేహితురాలి సలహాతో మరో పావుగంట అదనపు నడకకు సిద్ధపడింది. దాని వల్ల తను మరింత అలసిపోతోంది. అయితే రోజుకి 5 నుంచి 6 వేల అడుగులు వేయగలిగితే చాలు అంటోంది తాజా అధ్యయనం. ఇందులో తేలిన మరిన్ని విషయాలేంటంటే...

Published : 09 Feb 2022 01:02 IST

సునీతకు ఉదయాన్నే నడక అలవాటు. ఎంత పనున్నా ఓ అరగంట నడవాల్సిందే. కానీ కనీసం 10వేల అడుగులైనా వేయాలనే స్నేహితురాలి సలహాతో మరో పావుగంట అదనపు నడకకు సిద్ధపడింది. దాని వల్ల తను మరింత అలసిపోతోంది. అయితే రోజుకి 5 నుంచి 6 వేల అడుగులు వేయగలిగితే చాలు అంటోంది తాజా అధ్యయనం. ఇందులో తేలిన మరిన్ని విషయాలేంటంటే...

రోజుకి 7,000 అడుగులు వేసేవారిని ‘లోస్టెప్‌’, 7,000- 9,999 అడుగులు నడిచే వారిని ‘మోడరేట్‌’, అంతకన్నా ఎక్కువగా నడిచే వారిని ‘హై వాల్యూమ్‌’ గ్రూపుగా విడదీసి ప్రస్తుతం వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు. రెండువేల మందిపై ఈ అధ్యయయాన్ని చేశారు. 7 వేల అడుగుల కన్నా ఎక్కువగా నడిచేవారి ఆరోగ్యంలాగే 5 వేల అడుగులు వేసేవారిది కూడా ఉండటం గుర్తించారు. అంతేకాదు, వీరిలో పలురకాల అనారోగ్యాలతో మరణానికి దగ్గరయ్యే శాతం కూడా తక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే రోలూ 10 వేల అడుగుల దూరం కన్నా ఎక్కువగా నడిచిన వారిలో గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతెక్కువగా ఏమీ కనిపించలేదు. 4 నుంచి 5 వేల అడుగుల దూరం నడక అర్థవంతమైందని, ఈ పద్ధతి ఆరోగ్యానికేకాదు, ఫిట్‌నెస్‌కూ.. మంచిదని ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది. మరి ఎక్కువగా నడిస్తే నష్టమా అంటే ... అదేమీ లేదు. మీ శారీరక సామర్థ్యాన్నిబట్టి పదివేల అడుగులు కూడా వేయొచ్చంటూ, దీనివల్ల అనారోగ్యాలకు దూరంగా ఉండే వీలు మరి కాస్త ఎక్కువేనని ఆ నివేదిక సూచించింది. కానీ అంత నడవలేకపోతున్నామని బాధపడ్డం అవసరం లేదు. దానికోసం మిమ్మల్ని మీరు మరింత ఒత్తిడికీ గురి చేసుకోవాల్సిన పనీ లేదంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్