కలిపి తాగితే సరి!
అందం, ఆరోగ్యం సమస్య ఏదైనా.. తగినన్ని నీటిని తాగమంటారు వైద్యులు. ఒక్కోసారి మర్చిపోతుంటే.. ఇంకొన్నిసార్లు రుచి తగలక తాగబుద్దేయదు. మరెలా? కొన్ని పదార్థాలను జోడించుకుంటే
అందం, ఆరోగ్యం సమస్య ఏదైనా.. తగినన్ని నీటిని తాగమంటారు వైద్యులు. ఒక్కోసారి మర్చిపోతుంటే.. ఇంకొన్నిసార్లు రుచి తగలక తాగబుద్దేయదు. మరెలా? కొన్ని పదార్థాలను జోడించుకుంటే సరి. వీటివల్ల అదనపు ప్రయోజనాలు కూడా!
* నిమ్మ.. విటమిన్-సి పుష్కలం. నిమ్మరసం కలిపిన నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.
* యాపిల్ సిడార్ వెనిగర్... గ్లాసు నీటిలో రెండు చెంచాల యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి తాగండి. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపి, జీవక్రియలకు కావాల్సిన శక్తినిస్తుంది.
* పుదీనా... కొన్ని పుదీనా ఆకులను నీటిలో మరిగించి తాగితే నోట్లో లాలాజల గ్రంథుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణరసాల ఉత్పత్తితోపాటు కడుపు ఉబ్బరమూ తగ్గుంది.
* కీరా... కొన్ని కీరా ముక్కలను వేసి ఆ నీటిని కొన్ని గంటలు పక్కన ఉంచాలి. ఆ తర్వాత తాగితే సరి. ఇది జీర్ణక్రియ చక్కగా జరిగేలా చేసి, మలబద్ధక సమస్య రాకుండా చూస్తుంది.
* దాల్చిన చెక్క... ఆరోగ్యానికే కాదు... అందానికీ ఉపయుక్తం ఇది. మొటిమలనూ దూరం చేస్తుంది. గ్లాసు నీళ్లలో పావు చెంచా దాల్చిన చెక్క పొడి కలిపితే చాలు. ఇంకా పేగుల్లోని హానికారక సూక్ష్మజీవులను నిర్మూలించి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- నాకు ఏ క్రీమ్?
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
- కొత్తందాల క్రాప్ టాప్
ఆరోగ్యమస్తు
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
- ఇంటిలోనే వ్యాయామం...
- బరువు తగ్గించే నల్లబియ్యం!
అనుబంధం
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
- వధువుకి... నమస్కారం!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!