ఓట్స్‌తో కరిగించండి!
మనలో చాలామందికి ప్రధాన సమస్య అధిక బరువు. దీన్ని తగ్గించుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని రకాల కూరగాయలు, పండ్లు కొవ్వును కరిగించేస్తాయని తెలుసా..
మనలో చాలామందికి ప్రధాన సమస్య అధిక బరువు. దీన్ని తగ్గించుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని రకాల కూరగాయలు, పండ్లు కొవ్వును కరిగించేస్తాయని తెలుసా..
పాలకూర... దీంట్లో ఫోలిక్ ఆమ్లం, ఇనుము, విటమిన్-సి, క్యాల్షియం, ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. పాలకూర వల్ల ఉపయోగమేంటంటే ఇది పోషకాలను మాత్రమే అందిస్తుంది, కెలొరీలను కాదు.
వెల్లుల్లి.. దీంట్లోని అల్లిసిన్ అనే సమ్మేళనం కొవ్వులు, కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. కాబట్టి విరివిగా వాడేయండి.
గుడ్డు.. ఇవి మాంసకృత్తులతో నిండి ఉంటాయి. అందువల్లే వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అంది రోజంతా చురుగ్గా ఉంటారు. దీంట్లో ప్రొటీన్లే కాదు... విటమిన్లు, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. మరెందుకాలస్యం?... రోజూ ఉదయం ఓ గుడ్డు తినేయండి మరి.
చేపలు... ఇవి రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కొలెస్ట్రాల్న్ు తగ్గిస్తాయి. ఇన్ని లాభాలున్న వీటిని వారంలో ఒకట్రెండుసార్లు తింటే మేలే కదా.
ఓట్స్... వీటిలో మాంసకృత్తులు, పీచు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ముందుంటాయి. పీచు వల్ల తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. వెంటనే ఆకలి వేయదు. దాంతో ఇతర చిరుతిళ్ల వైపు దృష్టి పెట్టరు.
బ్రకోలీ... దీంట్లో క్యాల్షియం, పీచు ఎక్కువ. జీర్ణం కావడానికి చాలా సేపు పడుతుంది. దాంతో పొట్ట నిండిన భావన కలిగి వేరే పదార్థాలను తీసుకోరు.
పండు మిర్చి.. కాప్సియన్ అనే సమ్మేళనం ఘాటు, వేడిని అందిస్తుంది. దాంతోపాటు జీవక్రియలను వేగవంతం చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!