తీరైన కాళ్ల కోసం...

అందమైన, నాజూకైన కాళ్లు కావాలని ఎవరికుండదు చెప్పండి. ఇందుకోసం ఏయే కసరత్తులు చేస్తే బాగుంటుందో చూద్దామా..

Updated : 23 Nov 2022 10:11 IST

అందమైన, నాజూకైన కాళ్లు కావాలని ఎవరికుండదు చెప్పండి. ఇందుకోసం ఏయే కసరత్తులు చేస్తే బాగుంటుందో చూద్దామా..

స్క్వాట్స్‌... ఇవి కాళ్లకు తీరైన ఆకృతిని ఇస్తాయి. తొడలు, పిరుదులు, ఆబ్స్‌ను తీర్చి దిద్దుతాయి. అలాగే వెన్ను నొప్పిని తగ్గిస్తాయి. కొత్తగా వ్యాయామం మొదలుపెట్టేవారు సులువుగా చేసేయొచ్చు.

ఎలా అంటే... నిటారుగా నిల్చొని కెటిల్‌బెల్‌ని రెండు చేతులతో పట్టుకుని ఛాతీకి ఎదురుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా మోకాళ్లు, తుంటిని వంచాలి. ఈ సమయంలో వెన్ను, మెడ నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఈ స్థితిలో కాసేపుండి తిరిగి పూర్వపుస్థితికి రావాలి.

బాక్స్‌ జంప్స్‌... ఇది కాళ్లు, తొడలు.. మొత్తం శరీరానికే చక్కటి వ్యాయామం. అయితే కొత్తగా చేసేవారు దీన్ని నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. లేదంటే మోకాళ్లకు ప్రమాదం.

ఎలా చేయాలంటే... బాక్స్‌కు కొద్ది దూరంలో నిల్చొవాలి. పాదాలను భుజాలకు సమాంతరంగా పెట్టి... మోకాళ్లను వంచి చేతులను వెనక్కి ఊపుతూ తుంటి భాగాన్నీ వెనక్కి నెట్టి బాక్స్‌పైకి దూకాలి. ఆ తర్వాత కాస్త విరామం తీసుకుని కిందకు దూకాలి. ఈ సమయంలో తుంటి, వీపుపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి మెల్లిగా దూకాలి.

లాంజెస్‌... వీటిని చేయాలంటే శరీరంలోని అవయవాల మధ్య సమతుల్యం, సమన్వయం తప్పనిసరి. ఈ వ్యాయామం వల్ల తొడలు, పిరుదులపై ప్రభావం పడి అవి చక్కటి ఆకృతిని సంతరించుకుంటాయి.

ఎలా చేయాలంటే... నిటారుగా నిల్చొవాలి. ఆ తర్వాత ఒక కాలిని మోకాలి వరకు మడవాలి. రెండో కాలిని వీలైనంత వంచుతూ కాలి వేళ్లను నేలకు తాకించే ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో చేతులను నడుముకు ఇరువైపులా పెట్టుకోవాలి. ముఖం, ఛాతీ, మోకాళ్లు, భుజాలు ముందుకు ఉండేలా చూసుకోవాలి. ఈ స్థితిలో కాసేపు ఉండి తిరిగి పూర్వపు స్థితికి వచ్చేయాలి. ఆ తర్వాత రెండో కాలితోనూ చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్