అధిక బరువు.. కలబందతో మాయం!

బరువు పెరగకుండా ఉండటానికీ, పెరిగినదాన్ని తగ్గించడానికి అమ్మాయిలు ఎన్నో కసరత్తులు, ఆహార నియమాలూ పాటిస్తుంటారు కదా! ఈసారి వాటిల్లోకి కలబందనూ (అలోవెరా) చేర్చేయండి. దీంతో అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి.

Published : 15 Feb 2022 02:00 IST

బరువు పెరగకుండా ఉండటానికీ, పెరిగినదాన్ని తగ్గించడానికి అమ్మాయిలు ఎన్నో కసరత్తులు, ఆహార నియమాలూ పాటిస్తుంటారు కదా! ఈసారి వాటిల్లోకి కలబందనూ (అలోవెరా) చేర్చేయండి. దీంతో అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి.

* శరీరానికి అవసరమైన పోషకాలన్నింటినీ కలబంద అందించగలదు. దీనిలో ఎ, బి, సి, ఇ విటమిన్లతోపాటు 18 రకాల అమైనో ఆసిడ్లుంటాయి. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి, మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. తద్వారా బరువును తగ్గుతుంది.
* యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. రోజూ ఉదయాన్నే ఉసిరి, తులసితో కలిపి తీసుకుంటే శరీరం లోపల్నుంచీ క్లెన్సింగ్‌ అవుతుంది.
* ఎసిడిటీ, గ్యాస్‌, కడుపుబ్బరం వంటి సమస్యలున్న వారికీ చక్కని పరిష్కారం. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడమేకాక మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
* ఇది చర్మాన్ని మృదువుగా తాజాగా చేయడంతోపాటు మెరుపునూ అందిస్తుంది. కురులను బలంగా మారుస్తుంది... మృదుత్వాన్నీ ఇస్తుంది.
* నేరుగా తీసుకోవడం నచ్చకపోతే... కప్పు కలబంద గుజ్జుకు టేబుల్‌ స్పూను చొప్పున నిమ్మరసం, బెల్లం, గ్లాసు నీరు కలిపి మిక్సీ పట్టి పరగడుపున తాగితే సరి. కావాలనుకుంటే తేనెనీ కలుపుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్