హిమోగ్లోబిన్‌ తగ్గితే..

దేశంలో సగానికిపైగా మహిళలు, పిల్లలు ఐరన్‌ లోపంతో బాధ పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితమే హిమోగ్లోబిన్‌ తగ్గడం, ఎనీమియా మొదలైనవి. అందుకే వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే సమస్య ఉండదు.

Published : 16 Feb 2022 01:27 IST

దేశంలో సగానికిపైగా మహిళలు, పిల్లలు ఐరన్‌ లోపంతో బాధ పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితమే హిమోగ్లోబిన్‌ తగ్గడం, ఎనీమియా మొదలైనవి. అందుకే వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే సమస్య ఉండదు.
* కొర్రలు.. వీటిల్లో ఐరన్‌, క్యాల్షియం, ప్రొటీన్లతో పాటు ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కిచిడీ, లడ్డూ.. ఏ రూపంలో తీసుకున్నా మంచిదే.
* బెల్లం.. ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. అరుగుదలకు సాయపడటమే కాదు.. నెలసరి నొప్పినీ దూరం చేస్తుంది. చక్కెరకు ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగించండి. కెలొరీలు ఉండవు కాబట్టి, అధిక బరువు భయమూ ఉండదు.
* పాలకూర, గోంగూర.. ద్వారా ఐరన్‌, క్యాల్షియం రెండూ అందుతాయి. జీర్ణక్రియనూ వేగవంతం చేస్తాయి.
* విటమిన్‌ సి.. నిమ్మజాతి ఫలాలన్నింటిలో ఇది పుష్కలంగా ఉంటుంది. ఐరన్‌ను శోషించుకుని శరీరానికి అందించడంలో దీనిదే ప్రధాన పాత్ర. అంతేకాదు.. చర్మ నిగారింపులోనూ, మచ్చల్ని దూరం చేయడంలోనూ సాయపడుతుంది.
* పాత్రలు.. వంట చేసే గిన్నెలూ ఇక్కడ ప్రధానమే. లోహపాత్రలు వంట పదార్థాల్లోని రసాయనాలతో చర్యనొంది శరీరానికి హాని కలిగిస్తాయి. ఇనుప వాటికి ప్రాధాన్యమివ్వండి. కావాల్సినంత ఐరన్‌ కూడా అందుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్