వామాకు... అందం... ఆరోగ్యం!

వాము అందరికీ చిర పరిచితమే కానీ వామాకు కొందరికే తెలుసు. అది ఎంత అందమైందో, అద్భుతమైందో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఈ మొక్కల్ని తెచ్చి పెంచేస్తారు. ఇది మనసుకు హాయిగొల్పుతూ ఆరోగ్యాన్నీ ఇస్తుంది...ఆకుపచ్చటి దళసరి ఆకులుండే వాము మొక్క చూడచక్కగా ఉండి మంచి పరిమళాలు వెదజల్లుతుంది. ఇంటికి శోభనిచ్చే ఇది ఒంటికీ ఎంతో మేలు చేస్తుంది.

Published : 17 Feb 2022 00:15 IST

వాము అందరికీ చిర పరిచితమే కానీ వామాకు కొందరికే తెలుసు. అది ఎంత అందమైందో, అద్భుతమైందో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఈ మొక్కల్ని తెచ్చి పెంచేస్తారు. ఇది మనసుకు హాయిగొల్పుతూ ఆరోగ్యాన్నీ ఇస్తుంది...

ఆకుపచ్చటి దళసరి ఆకులుండే వాము మొక్క చూడచక్కగా ఉండి మంచి పరిమళాలు వెదజల్లుతుంది. ఇంటికి శోభనిచ్చే ఇది ఒంటికీ ఎంతో మేలు చేస్తుంది.

వామాకు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఈ ఆకు వాసన పీలిస్తే జలుబు తగ్గుతుంది. కఫం పడుతున్నట్టయితే గ్లాసుడు నీళ్లలో రెండు వామాకులను మరిగించి వడకట్టి తాగితే ఫలితం ఉంటుంది. దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులకు కూడా ఇది దివ్యౌషధం.

వామాకులో ఎ, బి, సి విటమిన్లు, అమినో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం ఉన్నందున ఇది మంచి పోషకాహారం.

కడుపునొప్పిని, జీర్ణకోశ ఇబ్బందులను తొలగిస్తుంది.

వామాకులతో వేసే శనగపిండి బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్