గర్భనిరోధక మాత్రలా... జాగ్రత్త

గర్భనిరోధక మాత్రల వినియోగంపై మిచిగన్‌ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసి ఇష్టారాజ్యంగా వాడద్దంటోంది...

Published : 19 Feb 2022 01:08 IST

గర్భనిరోధక మాత్రల వినియోగంపై మిచిగన్‌ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసి ఇష్టారాజ్యంగా వాడద్దంటోంది...
కుటుంబ నియంత్రణ మాత్రలను వాడుతున్న 702 మంది మహిళలపై సర్వే నిర్వహించగా, 33 శాతం గతంలో అశ్రద్ధ వహించడంతో గర్భం దాల్చామని, ఆ భయంతోనే మాత్రలు వినియోగిస్తున్నట్లు చెప్పారు. 49 శాతం గర్భం వస్తుందన్న  భయంతో వాడుతున్నామన్నారు. మిగతా వారు మరో 2, 3 కారణాలనూ.. జోడించారు. వారికున్న ఇతర ఆరోగ్య సమస్యలనూ అధ్యయనం చేశారు. ఫలితాలను చూసిన తరువాత వైద్యులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు...
* ఈ మాత్రలకు ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా స్పందిస్తుంది. అవగాహన లేమితో వీటిని వినియోగిస్తే పలు సమస్యలెదురయ్యే ప్రమాదం ఉంటుంది. కొందరికి మానసిక సమస్యలు, ఆందోళన, ఒత్తిడి వంటివి వస్తాయి. మూడ్‌ స్వింగ్స్‌కు కారణమవుతాయి. పార్శ్వనొప్పి, వికారం వంటివి రావడానికీ అవకాశం ఉంది.
* మాత్రలు వాడటం ఆపేసిన తర్వాత కూడా శరీరం తిరిగి యథాస్థితికి రావడానికి కొంత సమయం తీసుకుంటుంది. కొందరికి పీసీఓఎస్‌, ఎండోమెట్రియోసిస్‌ వంటి సమస్యల చికిత్సలో భాగంగా కూడా కుటుంబ నియంత్రణ మాత్రలను సూచిస్తారు. అలాంటప్పుడు అప్పటికే  వినియోగిస్తున్న విషయాన్ని వైద్యులకు చెప్పాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్