Published : 20/02/2022 00:43 IST

చిట్టి మెదళ్ల చురుకుదనానికి...

రమణి తన ఎనిమిదేళ్ల కూతురితో ఎన్నిసార్లు పాఠాలను వల్లించినా మరుసటి రోజుకే మర్చిపోతోంది. ఇటువంటి చిన్నారులకు పోషక విలువలున్న ఆహారం, మైండ్‌ గేమ్స్‌తో జ్ఞాపకశక్తిని మెరుగుపరచొచ్చు అంటున్నారు వైద్యనిపుణులు..

నెయ్యి...

మెదడు చురుకుదనానికి కొవ్వు అత్యంత ముఖ్యం. రోజూ ఆహారంలో రెండు లేదా మూడు చెంచాల ఆవునెయ్యిని చేరిస్తే చిన్నారుల మెదడు బాగా పనిచేసి జ్ఞాపక శక్తి, తెలివితేటలు పెరుగుతాయి. కొబ్బరిని ఆహారంలో చేరిస్తే మంచి ఫలితం ఉంటుంది. శరీరం డీహైడ్రేట్‌ కాకుండా మంచినీటిని ఎక్కువ తాగడం అలవరిస్తే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.    

అవిసె గింజలు..

ఒమేగా3 ఫాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే అవిసెల ఉపయోగమెంతో ఉంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్లు, ఖనిజ లవణాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. మతి మరపును దూరం చేసి, మెదడును చురుకుగా మారుస్తాయి. సలాడ్ల రూపంలో వీటిని పిల్లలకు రోజూ అందిస్తే మంచిది. అలాగే పసుపు మెదడు కణాలకు పలు రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది.

విటమిన్లు...

డి, బి 12 విటమిన్లుండే చేప, పాల ఉత్పత్తులు, గుడ్లు, పుట్టగొడుగులు, చికెన్‌ వంటివాటిని ఆహారంలో ఉండేలా చూస్తే, పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తాజా కూరగాయలతోపాటు ఆయా సీజన్లలో వచ్చే పండ్లను ఆహారంలో చేర్చాలి. ఇవన్నీ చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాకుండా మెదడును ఉత్సాహంగా ఉంచుతాయి. పిల్లల శరీరానికి కనీసం పావు గంటైనా ఉదయపుటెండ తగలాలి. రోజుకి రెండు గంటలైనా ఆరుబయట ఆడేలా చూడాలి. ఇది వారికి వ్యాయామంగా మారి, మెదడుకు ఆక్సిజన్‌ అందిస్తుంది. పనితీరు బాగుంటుంది.

మైండ్‌ గేమ్స్‌..

ఒకే రకమైన బొమ్మలను జత చేయించడం, పజిల్స్‌ను పూర్తి చేయించడం, బోర్డ్‌ గేమ్స్‌, వర్డ్‌ గేమ్స్‌ వంటివి పిల్లల మెదడును చురుకుగా ఉండేలా చేస్తాయి. జ్ఞాపకశక్తి, వేగంగా ఆలోచించడం వంటివన్నీ అలవడతాయి. ఇవే కాకుండా రకరకాల కథలను చదివి వినిపిస్తూ పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలి. కథల్లోని పాత్రలను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటే మతిమరుపు దూరమవుతుంది. అలాగే పాఠ్యాంశాలను చదివిన వెంటనే చూడకుండా రాయించడంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని