రాత్రి నిద్రతోనే మంచి ఆరోగ్యం...

రాత్రి రెండైనా కంటిపై కునుకు రాదు అనే రాధికకు ఆఫీస్‌ పనితో పగలు నిద్ర కుదరదు. దాంతో తరచూ నీరసం, పని చేయాలంటే నిరుత్సాహం. సమయానికి నిద్ర పోకపోతే అది జీవక్రియలపై చెడు ప్రభావం చూపెడుతుంది అంటున్నారు మాస్ట్రిచ్‌ విశ్వవిద్యాలయ (నెదర్‌ల్యాండ్స్‌) పరిశోధకులు.

Updated : 22 Feb 2022 06:12 IST

రాత్రి రెండైనా కంటిపై కునుకు రాదు అనే రాధికకు ఆఫీస్‌ పనితో పగలు నిద్ర కుదరదు. దాంతో తరచూ నీరసం, పని చేయాలంటే నిరుత్సాహం. సమయానికి నిద్ర పోకపోతే అది జీవక్రియలపై చెడు ప్రభావం చూపెడుతుంది అంటున్నారు మాస్ట్రిచ్‌ విశ్వవిద్యాలయ (నెదర్‌ల్యాండ్స్‌) పరిశోధకులు. వారి పరిశోధన తాజాగా డయాబెటాలాజియా జర్నల్‌లో ప్రచురణ అయ్యింది. పగటి, రాత్రి నిద్రకు తేడా ఉందని, జీవక్రియలపై ఇది ప్రభావం చూపిస్తుందని పేర్కొంటోందీ నివేదిక.   

రాత్రి నిద్ర...

రోజంతా అలసిన శరీరానికి నిర్ణీత సమయంలో నిద్రను అలవరచాలి. తగినంత నిద్ర ఉంటే శరీరం తిరిగి శక్తిని పుంజుకుంటుంది. పలు రకాల అనారోగ్యాలకు దానికదే చికిత్స చేసుకొనే శక్తి శరీరానికి ఉంటుంది. అంతేకాదు, జీవక్రియల్లో మార్పులు చోటు చేసుకోకుండా ఉండాలన్నా రాత్రి సమయాల్లో నిద్ర అత్యంత అవసరం. పగటి పూట నిద్రపోతున్నామనే భావన సరైనది కాదు. ఎందుకుంటే ఈ రెండు నిద్రలకూ చాలా తేడా ఉంటుందని అధ్యయనంలో తేలింది. రాత్రి నిద్రతోనే ఆరోగ్యం. రాత్రి నిద్ర మాత్రమే జీవక్రియలను సమన్వయం చేయగలదు. లేదంటే తీసుకున్న ఆహారంలోని పోషకాలను శరీరానికి శక్తిగా మార్చి అందించే ఈ ప్రక్రియలో మార్పులు చోటు చేసుకుంటాయి. రాత్రి కంటినిండా నిద్రపోతే, అది మెదడు పనితీరునూ మెరుగుపరుస్తుంది. తత్ఫలితంగా మానసికాందోళనలు వంటివి దరి చేరవు. పగటి వెలుతురు ప్రభావం నిద్రపై ఉంటుంది. దీంతో కంటినిండా నిద్రలేక అధికబరువు సమస్య దరిచేరుతుంది.

ప్రయత్నించాలి..

నిద్రలేమి సమస్య ఉన్నవారు వారం రోజులు ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించాలి. వెలుతురెక్కువగా లేకుండా ప్రశాంత వాతావరణాన్ని కల్పించుకోవాలి. నచ్చిన సంగీతాన్ని వినాలి. ఇష్టమైన పుస్తకాన్ని చదివినా క్రమేపీ మెదడు విశ్రాంతి దశలోకి వెళుతుంది. ఉదయం/ సాయంత్రం శారీరక శ్రమనిచ్చే నడక, వ్యాయామం, తోట పని వంటివి కల్పించుకోవడం మంచిది. ఇవి కండరాలను అలిసేలా చేస్తాయి. దాంతో నిద్ర సహజంగానే వస్తుంది. నిద్రరావడం లేదంటూ ఫోన్‌ చేతిలో ఉంచుకోకూడదు. నిద్రకు గంట ముందుగానే గ్యాడ్జెట్ల వినియోగాన్ని ఆపేస్తే చాలు. ఈ ప్రయత్నాలతోపాటు అవసరమైతే వైద్యుల సలహాను తీసుకోవాలి. రాత్రి పూట కంటి నిండా నిద్రపోతే ఆరోగ్యంగా, ఉత్సాహంగా రోజంతా గడపొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్