వయసుని తగ్గించుకుందామిలా!

వయసు పెరుగుతున్నప్పుడు జీవక్రియల వేగం నెమ్మదిస్తుంది. దాంతో హార్మోన్ల పనితీరు తగ్గుతుంది. ఈ ప్రభావం మగవాళ్లతో పోలిస్తే మహిళలపై ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న వయసుని లెక్క చేయకుండా జీవక్రియల్లో చురుకు పుట్టించి మునుపటి ఉత్సాహాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా. అయితే ఇవి చేసి చూడండి...

Published : 24 Feb 2022 01:05 IST

వయసు పెరుగుతున్నప్పుడు జీవక్రియల వేగం నెమ్మదిస్తుంది. దాంతో హార్మోన్ల పనితీరు తగ్గుతుంది. ఈ ప్రభావం మగవాళ్లతో పోలిస్తే మహిళలపై ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న వయసుని లెక్క చేయకుండా జీవక్రియల్లో చురుకు పుట్టించి మునుపటి ఉత్సాహాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా. అయితే ఇవి చేసి చూడండి...

లేత కిరణాల శక్తి: మనలో జీవగడియారం (సర్కాడియన్‌ రిథమ్స్‌) అనే వ్యవస్థ ఉంటుంది. ఫలానా సమయానికి నిద్రలేవాలి లేదా నిద్రపోవాలి అని నిర్థరించేది ఇదే. ఇది చురుగ్గా ఉన్నప్పుడే జీవక్రియలు మెరుగ్గా ఉంటాయి. లేలేత సూర్యకిరణాలకి ఈ గడియారాన్ని సక్రమంగా నడిపించే శక్తి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కార్టిసాల్‌, ఇన్సులిన్‌, లెప్టిన్‌ వంటి హార్మోన్లు బాగా పనిస్తాయి. అందుకే ఈ నులివెచ్చని సూర్యకిరణాలని కళ్లద్దాల్లేకుండా ఆస్వాదించాలి.

నిద్ర: అలసిన శరీరానికి పునురుత్తేజాన్ని ఇచ్చే రీసెట్‌ బటన్‌లాంటిది. నిద్ర పోవాలనుకున్న సమయానికి ఓ అరగంట ముందే ఫోన్‌ పక్కన పెట్టేయండి. సమయానికి నిద్రపోగలుగుతారు.

ఉపవాసం: శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి పోషకాహారమే కాదు... ఉపవాసమూ అవసరమే. అలాగని రోజంతా కటిక ఉపవాసం ఉండొద్దు. ఈ రోజు రాత్రి ఏడింటి నుంచి రేపు ఉదయం ఏడింటి వరకూ అనుకోండి. ఈ పద్ధతిలో అదనపు కెలొరీలను నివారించగలుగుతాం. బరువుని అదుపులో ఉంచగలుగుతాం.

రబ్బరు బ్యాండ్‌ పద్ధతి: ఉదయాన్నే మీ చేతికి ఐదు రబ్బర్‌బ్యాండులు వేర్వేరు రంగులవి పెట్టుకోండి. నీళ్లు తాగినప్పుడల్లా ఒక్కోటి తీసి నీళ్ల సీసాకి పెడుతుండండి. మూమూలుగా కంటే ఎక్కువ నీళ్లు తాగుతారు. ఆ నీటిని వేడెక్కించేటప్పుడు శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. దాంతో మీలో చురుకు పుడుతుంది.

ప్రొటీన్‌ ఉంటే: మాంసకృత్తులుండే ఆహారం... శరీర బరువుని కాక కండని పెంచుతుంది. బరువు తగ్గి జీవక్రియలు గాడిన పడతాయి. అయితే దీర్ఘకాలం ప్రొటీన్‌ ఆహారం మూత్రపిండాలపై భారం పడేట్టు చేస్తుంది కాబట్టి తగినంతే తింటే మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్