ఆందోళన తగ్గించే అర్ధ శీర్షాసనం

ఇంటా బయటా అనేక పనులతో సతమతమయ్యే మహిళలు తరచూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. దాన్నుంచి బయటపడటానికి యోగాను మించిన ఔషధం లేదు. దిగులూ ఆందోళనలను తగ్గించుకోవడానికి అర్ధ శీర్షాసనం ప్రయత్నించండి.

Updated : 27 Feb 2022 05:48 IST

ఇంటా బయటా అనేక పనులతో సతమతమయ్యే మహిళలు తరచూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. దాన్నుంచి బయటపడటానికి యోగాను మించిన ఔషధం లేదు. దిగులూ ఆందోళనలను తగ్గించుకోవడానికి అర్ధ శీర్షాసనం ప్రయత్నించండి.

ముందుగా మోకాళ్ల మీద వజ్రాసనంలో కూర్చోవాలి. మెల్లగా రెండు చేతులూ జోడించి మోచేతులు నేల మీద పెట్టాలి. తర్వాత వంగి తలను చేతుల మధ్య కిందికి ఆనించాలి. మోచేతులను దగ్గరగా ఉంచి, వాటి మీద బరువు వేస్తూ మోకాళ్లను నెమ్మదిగా పైకి లేపాలి. వాటిని తిన్నగా ఉంచి రెండు అడుగులు ముందుకు నడవాలి. తల, భుజాల దగ్గర్నుంచి పిరుదుల వరకూ సమానంగా ఉంచి కాలి వేళ్ల మీద ఉండాలి. తల మీద భారం వేయొద్దు.. కళ్లు మూసుకుని ఉండాలి. 30 నుంచి 60 సెకన్లు ఈ ఆసనంలో ఉండి మెల్లగా లేచి కూర్చోవాలి. దీనివల్ల మెదడుకు రక్తప్రసరణ బాగుంటుంది. ప్రాణవాయువు, పోషకాలు చక్కగా అందుతాయి. ఈ ఆసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, తలనొప్పి తగ్గుతాయి. కానీ తీవ్ర యాంగ్జయిటీ, పార్శ్వపు తలనొప్పి ఉన్నవాళ్లు ఈ ఆసనం వేయకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్