కొవ్వు కరిగించే డాంకీ కిక్స్‌

వ్యాయామం చేయకపోవడం.. చాలా సమయం సేపు ఒకే చోట కూర్చొని ఉండటం ఎక్కువగా చక్కెర వినియోగం..  శరీరంలో హార్మోన్ల అసమతౌల్యం.. బజారులో దొరికే నూనె, మసాలా ఆహారపదార్థాలను ఎక్కువగా తినడం... 

Published : 28 Feb 2022 01:25 IST

వ్యాయామం చేయకపోవడం.. చాలా సమయం సేపు ఒకే చోట కూర్చొని ఉండటం ఎక్కువగా చక్కెర వినియోగం..  శరీరంలో హార్మోన్ల అసమతౌల్యం.. బజారులో దొరికే నూనె, మసాలా ఆహారపదార్థాలను ఎక్కువగా తినడం...  తొడల్లో కొవ్వు పేరుకుపోవడానికి కొన్ని కారణాలు. అది తగ్గాలంటే.. వీటిని చేయాలి.

నడక/పరుగు... వీటిని క్రమం తప్పకుండా చేయడం వల్ల తొడల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. వేగవంతమైన నడక, పరుగు..  బరువు (కొవ్వు)ను తగ్గిస్తాయి. అంతేకాదు హృదయ స్పందనరేటునూ పెంచుతాయి. కండరాలు దృఢంగా మారతాయి. కాబట్టి రోజూ ఓ అరగంటపాటు నడవడమో, పరిగెత్తడమో చేయండి.

మెట్లు ఎక్కడం... ఇప్పటి నుంచి లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఉపయోగించండి. వీటిని ఎక్కి, దిగడం వల్ల తొడల్లోని అదనపు కొవ్వు కరుగుతుంది. మీరూ చురుగ్గా ఉంటారు.

డాంకీ కిక్స్‌... ఫొటోలో చూపినట్లుగా అరచేతులు, మోకాళ్లను నేలకు తాకిస్తూ... తలను కిందకు పెట్టాలి. ఇప్పుడు ఎడమ మోకాలిని శరీరానికి సమాంతరంగా పైకి ఎత్తాలి. (ఎల్‌ అక్షరంలా) ఆ తర్వాత కిందపెట్టాలి. ఇప్పుడు కుడి మోకాలితో అలానే చేయాలి. అలా రెండు కాళ్లూ మారుస్తూ ఇరవైసార్లు చేయాలి. ఆ  తర్వాత పూర్వపు స్థితికి రావాలి. ఇలా నాలుగుసెట్లు చేయాలి. దీనివల్ల పొట్ట, తొడల కండరాలు బలంగా మారడమే కాకుండా ఆ ప్రాంతాల్లోని కొవ్వు కరుగుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం.. తీపి, ఎక్కువ నూనె పదార్థాలు తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. కొందరిలో ఊబకాయం వల్ల నడవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే... తక్కువ కెలొరీలు ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పండ్ల రసాలు, పప్పులు, సలాడ్లు... మీ ఆహారంలో  ఉండేలా చూసుకోవాలి. పీచు ఉండే ఆహారం కూడా చేర్చుకోవాలి. ఇలాంటి ఆహారం తినడం వల్ల పొట్ట నిండిన భావన కలిగి చాలాసేపటి వరకు ఆకలి వేయదు. దాంతో అధికంగా తినరు. మీ పొట్టా ఆరోగ్యంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్