ఆ నొప్పి.. దూరమిలా!

నెలసరిలో కడుపు నొప్పి అందరికీ సాధారణమే. కొందరికి మాత్రం ఇది నరకం! ఈ చిన్ని చిట్కాలు పాటించేయండి. ఉపశమనం ఉంటుంది.

Published : 03 Mar 2022 01:32 IST

నెలసరిలో కడుపు నొప్పి అందరికీ సాధారణమే. కొందరికి మాత్రం ఇది నరకం! ఈ చిన్ని చిట్కాలు పాటించేయండి. ఉపశమనం ఉంటుంది.

* అరటి, నిమ్మ, పుచ్చకాయ, నారింజలను ఆ సమయంలో తీసుకోండి. వీటిల్లో నొప్పిని తగ్గించే గుణాలుంటాయి. మాంగనీస్‌ ఎక్కువగా ఉండే వాల్‌నట్స్‌, బాదం, గుమ్మడి గింజలను తీసుకున్నా ఫలితం ఉంటుంది.

* నిమ్మకాయ, తేనె కలిపిన గోరువెచ్చని నీరు, చామంతి టీ, మెంతుల నీళ్లు రోజుకు మూడు, నాలుగు సార్లు తీసుకొని చూడండి. తప్పక ఉపశమనం ఉంటుంది. కూల్‌డ్రింక్స్‌, చల్లని పదార్థాలను ఆ సమయంలో తీసుకోకపోవడం మంచిది.

* నెలసరి రావడానికి ఓ వారం ముందు నుంచే ఉప్పు, కెఫిన్‌, చాక్లెట్‌తోపాటు అధిక చక్కెరలుండే వాటికి దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువ మొత్తంలో నీరు తీసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చు. అవసరమైతే వైద్యుల సలహాతో డి6, బి, ఇ, సి సప్లిమెంట్లనూ తీసుకోవచ్చు. ఇవీ నొప్పికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీంతోపాటు ప్రతి గంటకీ అలా అలా నాలుగు అడుగులు వేస్తే.. పొత్తికడుపు, కటి వలయ కండరాలపై ప్రభావం పడీ నొప్పి తగ్గుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్