నలుపు పోగొట్టే పాలు, పెరుగు!

కొందరికి మోచేతులు నల్లగా మారి అసహ్యంగా కనిపిస్తుంటాయి. దాంతో వీళ్లు హాఫ్‌ హ్యాండ్స్‌ డ్రెస్సులు వేసుకోవడానికి ఇబ్బంది పడతారు. వంటింట్లో ఉండే సహజ పదార్థాలతోనే ఈ నలుపు

Updated : 03 Mar 2022 17:36 IST

కొందరికి మోచేతులు నల్లగా మారి అసహ్యంగా కనిపిస్తుంటాయి. దాంతో వీళ్లు హాఫ్‌ హ్యాండ్స్‌ డ్రెస్సులు వేసుకోవడానికి ఇబ్బంది పడతారు. వంటింట్లో ఉండే సహజ పదార్థాలతోనే ఈ నలుపు పోగొట్టుకోవచ్చు. ఎలాగంటే..

* పాలు, పసుపుతో... ఈ రెంటిని సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాసి, మృదువుగా మర్దనా చేయాలి. పావు గంటాగి కడిగేయాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేస్తే నలుపు తగ్గుతుంది. పసుపు బదులు చందనం పొడినీ వాడొచ్చు. పాలు చర్మానికి కావాల్సిన పోషణనిస్తే పసుపు నలుపును పోగొడుతుంది.

* తేనె, టొమాటో రసం... చెంచా టొమాటో రసంలో అర చెంచా తేనె కలపాలి. దీన్ని మోచేతులకు పట్టించాలి. ఆరాక కడిగేయాలి. టొమాటో నలుపును పోగొడితే, తేనె మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు ఓ వారం  ప్రయత్నించి చూడండి.. ఫలితం మీకే తెలుస్తుంది.

* పెరుగు, ఓట్స్‌తో... చెంచా చొప్పున పెరుగు, ఓట్స్‌ను కలిపి మోచేతులకు రాయాలి. రెండు మూడు నిమిషాలు రుద్దిన తర్వాత ఆరనిచ్చి కడిగేయాలి. పెరుగు, ఓట్స్‌ చర్మంపై మృతకణాలను తొలగించడమే కాకుండా త్వచానికి కావాల్సిన తేమను అందిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్